Oymyakon: ప్రపంచంలోనే అత్యంత చల్లనిప్రదేశం ఇదే...

  • Dec 24, 2020, 17:04 PM IST
1 /5

రష్యాలోని సైబీరియాలో Oymyakon అనే గ్రామం ఉంది.  అంటార్కిటిక తరువాత ప్రపంచంలో ఉన్న అత్యంత చల్లని ప్రదేశం ఇదే. ఇక్కడ ఉష్ణోగ్రత యావరేజ్‌గా సుమారు మైనస్ 50 డిగ్రీలు ఉంటుంది.

2 /5

2018లో అధికారిక రికార్డుల ప్రకారం ఈ గ్రామంలో సుమారు 500 నుంచి 800 మంది నివసిస్తుంటారు. ఈ గ్రామం గురించి సరిగ్గా తెలియకుండా వచ్చి చాలా మంది చలికి మరణిస్తుంటారట.  1924లో అత్యల్పంగా 71.2 సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదు అయిందట.  

3 /5

ఇక్కడి వాతావరణాన్ని బట్టి బతకడం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటారు పిల్లలు. మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ వద్ద పిల్లలు స్కూలుకు వెళ్తుంటారు. అంతకు మించిన ఉష్ణోగ్రత పడిపోతే స్కూళ్లు మూసి వేస్తారు.

4 /5

డిసెంబర్ నెలలో సూర్యుడు ఇక్కడ ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడు. ఇక్కడ కార్లు ఎప్పుడూ ఆఫ్ అవవు. ఆఫ్ చేస్తే కారు బ్యాటరీలు గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.

5 /5

చలికాలం ఇక్కడ మొక్కలు కూడా మొలవలేవు. అందుకే అక్కడ చలికాలం వ్యవసాయం సాగదు. అందుకే మాంసమే తీసుకుంటారు. చేపలు, జింకలు, గుర్రాలు.. ఇలా వీరి ప్రోటీన్ సోర్స్ లిస్టు పెద్దదే.!