Norway Rules: ప్రపంచంలోని మారుమూల దేశాల్లో, ప్రాంతాల్లో ఎన్నెన్నో వింతలతో పాటు మరెన్నో నిబంధనలు, చట్టాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ దేశం నార్వే అందుకు ఉదాహరణ. ఈ దేశంలో పిల్లల్ని పెంచడం నేరం. అంతేకాదు..ఎవరైనా చనిపోతే ఖనం చేయకూడదు. ఇలా వింతైన ఆంక్షలున్నాయి.
ఇక్కడ ద్రోన్ ఎగురవేయడం, సముద్ర మంచుపై స్మోమోబిల్ నడపడం కూడా నిషేధమే. కొన్ని ప్రాంతాల్లో మంచు చరియలు విరిగి పడే ప్రమాదమున్నందున పర్యాటకులు సైతం ఎక్కడపడితే అక్కడ విహరించలేరు.
ఇక్కడ పిల్లలకు జన్మనివ్వడంపై కూడా నిషేధముంది. అంటే జననాలపై నిషేదం ఉంది. గర్భీణీ మహిళల్ని డెలివరీ కంటే ముందే స్వాల్బార్డ్ ద్వీపం నుంచి నార్వేలోని ఆసుపత్రికి పంపించేస్తారు.
స్వాల్బార్డ్ ద్వీపంలో మృతదేహాల్ని ఖననం చేయకూడదు. ఎందుకంటే మంచులో మృతదేహాలు ఖననం కావు. 1918లో స్పానిష్ ఫ్లూ సమయంలో ఖననం చేసిన శవాలు కూడా మట్టిగా మారలేదు.
పిల్లుల్నించి ఇక్కడి పక్షులు ఇతర వన్య జీవాలకు ముప్పుందనేది స్థానికుల భావన. అందుకే 1990 నుంచి ఇక్కడెవరూ పిల్లుల్ని పెంచకూడదు. పర్యాటకులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
లాంగియర్బన్ నగరానికి వచ్చే పర్యాటకులకు కొన్ని నియమాలున్నాయి. పర్యాటకులు తమ వెంట ఎప్పుడూ గన్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా ధృవ ఎలుగుబంట్లు దాడి చేయవచ్చు. ఈ ద్వీపంపై 2500 మంది నివాసముంటున్నారు. అయితే ఎలుగుబంట్లు మాత్రం 3 వేలకు పైగా ఉన్నాయి.
ఈ నగరంలో పిల్లుల్ని పెంచడం లేదా ఎవరైనా చనిపోతే ఖననం చేయడంపై నిషేధముంది. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రకృతి ప్రదేశాల్లో ఈ నగరం ఒకటి. ప్రస్తుతం ఇక్కడి మంచు అంచాల్ని ఆస్వాదించేందుకు పెద్దఎత్తున పర్యాటకలు తరలివస్తున్నారు.
యూరోపియన్ దేశమైన నార్వే అంటే ప్రకృతి అందాలకు, రమణీయతకు పెట్టింది పేరు. నార్వేలోని స్వాల్బర్డ్ ద్వీపానికి చెందిన లాంగియర్బన్ నగరవాసుపు ప్రకృతి నియమాలు తప్పకుంటా పాటిస్తుంటారు. ప్రకృతి అందాల్ని కాపాడుతుంటారు. ఇక్కడికొచ్చే పర్యాటకులు కూడా చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.