EPFO Nominee Pension: భారతదేశంలో నామిని అనేది.. మరణం తర్వాత ఎవరికి బాధ్యతలు ఆస్తులు బదిలీ చేయాలని అంశాన్ని నిర్దేశిస్తుంది. పెన్షన్ విషయంలో కూడా ఇదే సూచిస్తుంది. EPFO పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరు నామినీని ఎప్పటినుంచో ఆడ్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల సదరు ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు ఇది ఎంచుకున్న నామినీకి బదిలీ అవుతుంది.
ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు ఎంచుకున్న నామినికి నిధులతో పాటు పెన్షన్ కూడా బదిలీ చేసుకునే సదుపాయాన్ని ఉంది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుందా? లేదా ప్రైవేటు ఉద్యోగులు కూడా నామినీకి బదిలీ చేయవచ్చా అనేది ప్రశ్నగా చాలామందిలో మెదులుతోంది.
నిజానికి నామిని అనేది ప్రైవేటు ప్రభుత్వం అని సంబంధం లేకుండా రెండు రంగాలకు సంబంధించిన ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది పెన్షన్ అప్లై చేసే సమయంలోనే మీకు అందించే ఫార్మ్ లో ఉంటుంది. ఇందులో భాగంగానే మీరు ఈ కుటుంబంలో పెద్దగా భావించే వారిని నామినీగా యాడ్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ పెన్షన్ లో నామిని కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు ఇది గొప్ప వరంగా భావించవచ్చు. వారు మరణించిన తర్వాత వారి కుటుంబానికి ఈ నామిని పెన్షన్ ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది.
EPFO పెన్షన్ లో భాగంగా ప్రస్తుతం నామినీగా మీ కుటుంబ సభ్యులు (భార్య/భర్త, తల్లి/తండ్రి, పిల్లలు) యాడ్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఎవరైనా ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు వారికి రావాల్సిన పెన్షన్ లేదా నగదు నేరుగా ఈపీఎఫ్ నామిని పథకం కింద కుటుంబానికి లభిస్తుంది.
ప్రస్తుతం మరణించిన చాలామంది ప్రైవేట్ ఉద్యోగులు ఈ నామిని ఈపీఎఫ్ పెన్షన్ తెలియక వదిలేస్తున్నారు. అయితే ఈ పెన్షన్ పొందడానికి EPFO కార్యాలయాన్ని సందర్శించి నామినీ పెన్షన్‌కు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కొన్ని రోజుల వ్యవధిలోనే ఆర్థిక సహాయం లభిస్తుంది.