EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది

ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.

EPF Withdrawal Conditions: ప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి.

1 /6

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నియమాలను 6 కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పాటిస్తారు. ఎందుకంటే సమయానుగుణంగా వీరికి ఈపీఎఫ్ ఖాతాల నుంచి ప్రయోజనాలు అందుతాయి. ఆ కారణంతో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ప్రయోజనాలు, పీఎఫ్ బ్యాలెన్స్, ఈపీఎఫ్‌ఓ తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడూ ఈ ఆరు కోట్ల మంది ఖాతాదారులు తెలుసుకోవాలని భావిస్తారు. వీరికి ఈపీఎఫ్‌ఓ పన్ను మినహాయింపు, పెన్షన్, ఇన్సూరెన్స్, చేతికి అవసరమైన కొన్ని సందర్బాలలో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. Also Read: EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి

2 /6

ఉద్యోగి జీతం నుంచి ప్రతినెలా బేసిక్ శాలరీలో 12 శాతం కట్ అవుతుంది. ఆ మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదే సమయంలో ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో నగదును ప్రతినెలా ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు డబ్బు అవసరం అవుతుంది. చేతికి డబ్బు దొరకని కొన్ని సందర్భాలలో మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్‌ఓ కల్పించింది. 

3 /6

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే ఈపీఎఫ్ నగదును కొంతమేర విత్‌డ్రా చేసి తీసుకోవచ్చు. కొందరు నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో, హోం లోన్ రీపేమెంట్, ఇల్లు కొనుగోలు చేయడం కోసం, మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల వివాహం లాంటి విషయాలలో ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకుని వినియోగించుకునే వీలుంది.  Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి

4 /6

ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో 75 శాతం మేర ఈపీఎఫ్ నగదు విత్‌త్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ అవకాశం కల్పించింది. ఆపై అదనంగా మరో నెల ఉద్యోగం లేకుండా ఉన్న నేపథ్యంలో మిగతా 25 శాతం నగదు విత్‌డ్రా చేసుకునే వీలుంది. 

5 /6

నూతన ఇంటిని కొనుగోలు చేయడం, లేదా మీ ఇల్లును రీడిజైన్ చేసుకోవడం లాంటివి చేసిన సమయంలో ఖాతాదారులు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. 90 శాతం వరకు నగదును ఈపీఎఫ్ ఖాతాదారులు తీసుకోవచ్చు.  Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

6 /6

వీటితో పాటు ఈపీఎఫ్ ఖాతాదారులు వారి పిల్లల వివాహం విషయంలో ఈపీఎఫ్ నుంచి సాయం పొందవచ్చు. అయితే ఈపీఎఫ్ ఖాతా తెరిచి ఏడేళ్లు అయి ఉండాలి. వివాహం విషయంలో అయితే 50 మేర మాత్రమే ఈపీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే వెసలుబాటు ఉంది.  స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook