Vijayadashami celebrated in India: దసరా ఉత్సవాల్లో భాగంగా చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు.
Dussehra 2021 When is Vijayadashami celebrated in India, check details here: అక్టోబర్–నవంబర్ రాగానే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు మొదలవుతాయి. దేశం అంతటా ఈ పండుగను అంగరంగా వైభంగా నిర్వహించుకుంటారు. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల వేళ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటారు. చాలా చోట్ల రామ్లీలా నాటకాలు ప్రదర్శిస్తారు. అక్కడక్కడా దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు.
దసరా ఉత్సవాలు దేశమంతటా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలను సుందరంగా అలంకరిస్తారు. అలాగే చాలా చోట్ల పెద్ద రావణుడి బొమ్మ తయారుచేసి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల వేళ భక్తులు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటారు. చాలా చోట్ల రామ్లీలా నాటకాలు ప్రదర్శిస్తారు. దసరా పండుగ రోజున రావణుడితో పాటు కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తారు.
దుర్గామాత మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దసరా ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకొంటారు. రావణుడిని శ్రీరామచంద్రుడు అంతమొందించాడని చెబుతూ దసరా జరుపుకుంటున్నామనేది ఒక కారణమైతే...మహిషాసురుని దుర్గామాత అంతమొందించిందనే కారణంగా కూడా దసరా వేడుక జరుపుకుంటాం.
దసరా రోజున షమీ పూజ,అపరజిత పూజ,సీమ అవలంగ్హన్ పూజలు నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో దసరా పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దుర్గా పూజ 10వ రోజున బెంగాళీలు బిజోయ దశమిని పాటిస్తారు.ఈ రోజున దుర్గామాత ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు.
విజయదశమి రోజున అహంకారి అయిన రావణుడిన శ్రీరాముడు అంతం చేశారని నమ్ముతారు. ఓ రాక్షసుడి నుంచి భూమిని శ్రీరాముడు రక్షించాడని విశ్వసిస్తారు. రావణుడి దురాగతాలు ఈ రోజుతో ముగుస్తాయని భావిస్తారు. ఇక ఈ సారి అక్టోబర్ 15న విజయదశమిని నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించే రావణ దహనం చూసి తీరాల్సిందే.