Shani Transits Pisces: శని దేవుడి ప్రభావం మనపై మంచిగా ఉంటే.. మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరవచ్చు. అలాంటి శని దేవుడికి నాలుగు రాశులు అంటే ఎంతో ఇష్టము. ఈ రాశిల్లో పుట్టిన వారికి తిరిగే ఉండదు. మరి ఆ రాశులు ఎవో ఒకసారి చూద్దాం..
మన జీవితంలో శని దేవుని ప్రభావం ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే శని దేవుని ఆశీస్సులు ఉంటాయో.. వారికి జీవితంలో తిరుగుండదు.
జ్యోతిష్య శాస్త్రంలో కూడా అన్ని గ్రహాలకంటే శని గ్రహానికి ఎంతో ఉత్తమమైన స్థానం ఉంది. కాగా కొంతమంది పుట్టుకతోనే శని దేవుని ఆశీస్సులు పొందుతారు. ఈ కింద చెప్పిన నాలుగు రాశుల్లో పుట్టిన వారికి.. శని దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అనేది మన జ్యోతిష్య శాస్త్ర నమ్మకం.
మకర రాశికి అధిపతి శని దేవుడు. మకర రాశిని పాలించే గ్రహమే శనిదేవుడు కాబట్టి.. వారికి ఆయన ఎన్నో ఆనందాలను కలిగిస్తారు అనేది ఎంతోమంది ప్రగాధ నమ్మకం.
కుంభరాశిని పాలించే గ్రహం కూడా శనిదేవుడే. తద్వారా శనిదేవరు ఈ రాశి వారిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతారు. అంతే కాదు ఈ రాశి వారికి.. ఎల్లప్పుడూ డబ్బు పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
శని దేవునికి ఎంతో ఇష్టమైన రాశి తుల రాశి. ఈ రాశి వారికి శని దేవుడు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు అనేది ఎంతోమంది నమ్మకం.
ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి. కాగా శని, బృహస్పతి మధ్య బలమైన స్నేహం ఉంది. అందుకే ధనస్సు రాశి వారుకి కూడా ఎల్లప్పుడూ శని దేవుని ఆశీస్సులు కలిగి ఉంటాయి.