Rahu Dosham Solution; గ్రహాలలో ఒకటైన రాహువు అత్యంత ప్రభావ వంతమైన గ్రహంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనిని నీడ గ్రహంగా పరిగణిస్తారు. రాహువు యొక్క చెడు ప్రభావాలు మనిషిని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా మరింత కృంగదీస్తాయి. అయితే ఇలా రాహువు చెడు దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే గోమేదికం ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.అయితే ఈ రత్నం ఎవరు ధరించాలి..? ఎప్పుడు ధరించాలి..? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు అనుగుణంగా ఒక్కో రత్నం ఉంటుంది. అయితే నీడ గ్రహంగా పరిగణించే రాహువు కు సంబంధించి కూడా ఒక రత్నం ఉంది రాహువు రత్నంగా గోమేధికాన్ని రత్న శాస్త్రంలో పరిగణిస్తారు. ఈ రత్నం ధరించడం వల్ల.. ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు పొందుతారని నమ్ముతారు.
ముఖ్యంగా జాతకంలో రాహువు స్థానం శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు అందుకుంటాడు. ఒకవేళ నీచ స్థానంలో రాహువు ఉంటే మాత్రం ఆ వ్యక్తి జీవితం సమస్యలతో సతమతమవుతుంది.
రాహువు చెడు ప్రభావం వల్ల ఒత్తిడి, అబద్ధాలు చెప్పడం, కోపం, మానసిక ఇబ్బంది, చెడు పనులు వంటి అనేక సమస్యలు కలుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో రాహువు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించడానికి గోమేధికా రత్నాన్ని ధరించడం ప్రయోజనకరం. అయితే ఎవరైనా సరే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్య శాస్త్ర సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
ఫిబ్రవరి 15 నుండి మార్చి 14 మధ్య జన్మించిన వారు సూర్యుడు కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ రాహువు యొక్క రత్నాన్ని ధరించవచ్చు. గోమేధికాన్ని ఒనిక్స్ అని కూడా పిలుస్తారు దీని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. రత్నం జ్యోతిష్యం ప్రకారం గోమేదికం బరువు 6,11 లేదా 13 క్యారెట్లు ఉండాలి అదే సమయంలో 7,10 లేదా 16 రట్టిలా గోమేధికారత్నాన్ని ధరించడం మానుకోవాలి. ఈ రత్నాన్ని వెండి లేదా అష్టధాతువుతో చేసిన ఉంగరంలో ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఇక ఈ గోమేధికా రత్నాన్ని శనివారం సూర్యాస్తమయం తర్వాత మధ్య వేలుకి ధరించాలి. గోమేధికారత్నాన్ని రూబీ , పగడం, ముత్యాలతో కలిపి ధరించకూడదు. మిథునం, మకరం, తుల, కుంభం, వృషభ రాశి వారు ధరించవచ్చు. ముఖ్యంగా రాహువు మీ జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రత్నం ధరించాలి.