Dubai Mall: ప్రపంచంలో రెండవ అతిపెద్ద షాపింగ్ మాల్, ఎందుకంటే ఫేమస్ అంటే

దుబాయ్ అంటే ప్రసిద్ధి చెందిన కట్టడాలకు పేరు. ప్రపంచంలో అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఉన్న దుబాయ్ మాల్ కొత్త చరిత్రను సృష్టించింది.  2023లో ఈ మాల్‌ను పదిన్నర కోట్లమంది సందర్శించారు. ప్రతియేటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.

Dubai Mall: దుబాయ్ అంటే ప్రసిద్ధి చెందిన కట్టడాలకు పేరు. ప్రపంచంలో అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఉన్న దుబాయ్ మాల్ కొత్త చరిత్రను సృష్టించింది.  2023లో ఈ మాల్‌ను పదిన్నర కోట్లమంది సందర్శించారు. ప్రతియేటా సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.

1 /5

దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ అనేది దుబాయ్ మాల్‌ లో ప్రత్యేక ఆకర్షణ. మెరైన్ జీవితాన్ని అత్యంత సమీపం నుంచి అనుభూతి పొందవచ్చు. 140కుపైగా జంతుజీవాలను చూడవచ్చు.

2 /5

దుబాయ్ మాల్ అనే కంటే ప్యాలెస్ అనడం మంచిది. ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి బెస్ట్ ప్లేస్ ఇది. చాలమందికి ఇక్కడికి సందర్శన కోసమే వస్తుంటారు.

3 /5

తిండిప్రియులకు  దుబాయ్ మాల్ చాలా ప్రసిద్ధి. ఇండియన్స్, అమెరికన్స్, బ్రిటీష్, ఫ్రెంచ్, ఇటాలియన్,  మిడిల్ ఈస్టర్న్, చైనీస్ ఇలా ప్రతి దేశపు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. 

4 /5

విచ్చలవిడిగా, స్వేఛ్ఛగా ఖర్చుపెట్టేవారికి దుబాయ్ మాల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఫ్రాగ్నెన్స్, హోమ్ డెకోర్, లగ్జరీ వస్తువులు లెక్కలేనన్ని ఉంటాయి.

5 /5

దుబాయ్ మాల్ 2008లో ప్రారంభమైంది. విస్తీర్ణం ప్రకారం చూస్తే ప్రపంచంలో రెండవ అతిపెద్ద మాల్ ఇది. ఇందులో 1200 కు పైగా రిటైల్ స్టోర్స్ ఉన్నాయి.