బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం "దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే" తెలుగులో కూడా హిట్ చిత్రంగా నిలిచింది
బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన ఉత్తమ భారతీయ సినిమాల జాబితాలో "దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే" చిత్రానికి కూడా చోటు కల్పించడం విశేషం.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య చోప్రా తర్వాత షారుఖ్ నటించిన మొహబ్బతే, రబ్ నే బనాదీ జోడీ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. దిల్ తో పాగల్ హై, వీర్ జరా, చక్ దే ఇండియా, జబ్ తక్ హై జాన్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
ఈ సినిమాతో షారుఖ్, కాజోల్ జంట సూపర్ హిట్ పెయిర్‌గా కితాబునందుకుంది. తర్వాత వారిద్దరూ కలిసి కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాలలో నటించారు.
ఈ సినిమా విడుదలయ్యాక.. ఇదే చిత్రాన్ని ప్రేరణగా తీసుకొని అనేక భాషల్లో అనేక సినిమాలు పదుల సంఖ్యలో నిర్మించబడ్డాయి.
తెలుగులో "ప్రేమించి పెళ్లాడుతా" పేరుతో డబ్బింగ్ సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల మోత మోగించింది. ముఖ్యంగా పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
1995లో విడుదలైన ఈ చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో 10 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కైవసం చేసుకుంది.
యశ్ చోప్రా తనయుడు ఆదిత్యా చోప్రాకి దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. తొలి చిత్రంతోనే ఆయన సినీ ప్రపంచం గుర్తుంచుకోదగ్గ బ్లాక్ బస్టర్ విజయాన్ని కైవసం చేసుకున్నారు.
దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది.ముంబయిలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఈ చిత్రం 20 సంవత్సరాలు నిరాటంకంగా ప్రదర్శితమైంది. అదో రికార్డు