Coconut Water-sabja Seed For Diabetes Control: శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం ఒక కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిబంధనలు సూచించిన సబ్జా విత్తనాల ఇంటి చిట్కాను తప్పకుండా పాటించండి.
Coconut Water-sabja Seed For Diabetes Control: ఆధునిక జీవనశైలి శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం కారణంగా అనేక రకాల వ్యాధులు రావడం ప్రారంభమవుతాయి చాలామందిలో అలసట ఇతర అనారోగ్యం కారణంగా కూడా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది అతి చిన్న వయసులోనే ఒత్తిడి ఇతర కారణాల వల్ల మధుమేహం బారిన పడుతున్నారు.
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు బారిన కూడా పడుతున్నారు.
కొంతమందిలో మధుమేహంతో పాటు మలబద్ధకం సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం శరీరంలోని తగినంత నీరు ఫైబర్ లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా తీవ్ర పొట్ట సమస్యలు కూడా వస్తున్నాయి.
ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు ప్రతిరోజు పాటించాల్సి ఉంటుంది. మధుమేహం మలబద్ధకం వంటి సమస్యలకు ఆయుర్వేద శాస్త్రంలో అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి.
ఈ సమస్యలు తగ్గడానికి ఆయుర్వేద శాస్త్రంలో భాగంగా ప్రతిరోజు సబ్జా విత్తనాలతో తయారుచేసిన ఒక డ్రింక్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ డ్రింక్ లో ఉండే ఆయుర్వేద గుణాలు సులభంగా రక్తం లోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తాయి.
మధుమేహం ఉన్నవారు సబ్జా విత్తనాలతో తయారుచేసిన డ్రింకును తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ఈ డ్రింకును తాగడం వల్ల మలబద్దకం సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు ప్రతిరోజు పెరగడం తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి మీరుతో పాటు సబ్జా విత్తనాలను తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు పొందుతారు ఎందుకంటే ఇందులో లభించే ఔషధ గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రిస్తాయి.
అలాగే సబ్జా గింజలను కొబ్బరి నీటితో కలిపి తాగడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో పీచు పదార్థం లభిస్తుంది. దీని కారణంగా మూత్రపు ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కూడా రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని, దీంతో పాటు అధిక రక్తపోటు సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ డ్రింకును తీసుకోవాలి.
(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ వీటిని ఆమోదించదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే ఉపయోగించండి)