కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ ఇవాళ కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి నేలమట్టమైన చూరల్ మల గ్రామాన్ని సందర్శించారు. బాధితుల్ని పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని కలుసుకున్నారు. రాహుల్, ప్రియాంక వయనాడ్ పర్యటన ఫోటోలు మీ కోసం..
Rahul Gandhi Wayanad Visit: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ ఇవాళ కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి నేలమట్టమైన చూరల్ మల గ్రామాన్ని సందర్శించారు. బాధితుల్ని పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని కలుసుకున్నారు. రాహుల్, ప్రియాంక వయనాడ్ పర్యటన ఫోటోలు మీ కోసం..
వయనాడ్ ప్రజల బాధను చూడలేకపోతున్నామన్నారు. బాధితులకు అండగా నిలిచేందుకే ఇక్కడి వచ్చామన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ తరహా విషాషాలు చోటుచేసుకున్నాయని ప్రియాంక గాంధీ తెలిపారు.
వయనాడ్ విషాదం మనసుల్ని కలచివేసిందన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించడమే తమ లక్ష్యమన్నారు.
బాధితులతో మాట్లాడి ఓదార్చారు. ధైర్యంగా ఉండాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన తండ్రి రాజీవ్ గాంధీ మరణించినప్పుడు ఎంత బాధపడ్డాలో ఇప్పుడు అంత బాధగా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ బాధను చాలా మంది అనుభవిస్తున్నారన్నారు.
వయనాడ్ విలయం బాధిత ప్రాంతాల్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్ని పరిశీలించారు. ప్రజల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ఎలా ఉన్నాయో పరిశీలించారు
ఈ ఘటనలో ఇప్పటి వరకూ 256 మంది మరణించగా మరెందరో కన్పించడం లేదు. ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకీూ 1000 మందిని రక్షించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ సహా ఇతర సిబ్బంది మూడ్రోజుల్నించి సహాయక చర్యల్లోనే ఉన్నారు.
వయనాడ్ జిల్లాలో పెను ఉపద్రవంతో చూరల్ మల, ముందక్కై, అట్టమాల, నూల్ పుజ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా ఎంత నష్టమనేది ఇంకా అంచనాలకు అందడం లేదు.
భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. కొండ చరియలు విరిగిపడి బురద మట్టి కొట్టుకొచ్చి ఊర్లను ముంచేసింది. జూలై 29 రాత్రి జరిగిన ఈ పెను ఉపద్రవంలో ఇప్పటి వరకూ 256 మంది మరణించారు. ఇంకా చాలామంది ఆచూకీ తెలియాల్సి ఉంది.