Pooja khedkars row: పూజా ఖేద్కర్ యూపీఎస్సీనుంచి డిబార్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో ఆరుగురు సివిల్స్ సర్వెంట్ల సర్టిఫికేట్లను డీఓపీటీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర క్యాడర్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన పనులు ఆమెను పూర్తిగా చిక్కుల్లో పడేశాయి. ఎవరు పట్టుకోలేరని ఆమె చేసిన పనులన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి , ఏకంగా ఆమె జాబ్ పోయేందుకు కారణమయ్యాయి. భవిష్యత్తులో కూడా సివిల్స్ ఎగ్జామ్ లు రాయకుండా.. కూడా యూపీఎస్సీ డిబార్ చేసింది.
ఈ క్రమంలో ఆమెకు ఢిల్లీ హైకోర్ట్ కూడా బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెపై దాఖలైన కేసుల్లో.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పూజా ఖేద్కర్ ఫోన్ స్విచ్ రావడంతో పాటు, ఆమె అందుబాటులోకి రాకుండా అబ్ స్కాండ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొందరు ఆమె కేసులకు భయపడి.. దుబాయ్ కు కూడా పారిపోయిందని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. పూజా ఖేద్కర్ ఘటనతో యూపీఎస్సీ అలర్ట్ అయ్యింది. డీఓపీటీ మరికొంత మంది సివిల్ సర్వెంట్ల సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన పెను దుమారంగా మారింది.
సదరు అధికారుల్లో ఐదురుగు ఐఏఎస్ లుగా కాగా, ఒక ఐఆర్ఎస్ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వివాదాస్పద మాజీ ఐఏఎస్ పూజాఖేద్కర్ ఘటన నెల రోజుల వ్యవధిలోనే ఆమె యూపీఎస్సీ నుంచి డిబార్ అయ్యే వరకు వెళ్లింది. ఈ క్రమంలో.. పూజాఖేద్కర్ ట్రైనింగ్ లోనే ఉండగా వసతుల విషయంలో డిమాండ్ చేయడం, ట్రైనింగ్ లో ఉండగా.. డీఎస్సీ అధికారిని చోరీ కేసులో దోంగను విడుదల చేయమనం వివాదాస్పదంగా మారాయి.
అంతేకాకుండా..పూణేలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టం, పూజాఖేద్కర్ తల్లిదండ్రులు కూడా భూమి విషయంలో పిస్టల్ తో అమాయకులను బెదిరించడం వంటి ఘటనలు సంచలనంగా మారాయి. పూజా ఖేద్కర్ తండ్రి సివిల్స్ సర్వేంట్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు, అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఘటన వెలుగులోకి వచ్చింది.
పూజా ఖేద్కర్ నకిలీ సర్టిఫికేట్ల ఘటన వెలుగు చూపిన తర్వాత దేశంలో ప్రతిష్టాత్మకంగా ఎగ్జామ్ లను నిర్వహించే యూపీఎస్సీపైన కూడా అనేక మంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం డీఓపీటీ అధికారులు మరో ఆరుగురు సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటన ఎటువైపు దారితీస్తుందో అని చాలా మంది ఆందోళన విస్మయం వ్యక్తం చేస్తున్నారు.