New Warning on Cigarettes: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కొత్త వార్నింగ్.. ఇక అలవాట్లు మార్చుకోవాల్సిందే

New Warning on Cigarettes: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్ ప్యాకెట్లతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీపై కొత్త హెచ్చరికలతో కూడిన ఫోటోలు ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు నేడే కేంద్రం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.

Cigarettes To Have New Warnings Images: అందులో భాగంగానే సిగరెట్స్, టుబాకో ప్రోడక్ట్స్  (ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్) రూల్స్ 2008  చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై కొత్త హెచ్చరికల ఫోటోలు రానున్నాయి.

1 /6

New Warning on Cigarettes: ఈ హెచ్చరికలు రెండు రకాలుగా ఉండనున్నాయి. అందులో మొదటిది '' టుబాకో కాజెస్ పెయిన్‌ఫుల్ డెత్ ( పొగాకు తాగేవారు నొప్పితో కూడిన చావు అనుభవిస్తారు) '' అని రాసి ఉండనుంది.

2 /6

New Warning on Cigarettes: '' టుబాకో యూజర్స్ డై యంగర్ (పొగాకు తాగే వారు చిన్న వయస్సులోనే మృతి చెందుతారు) '' అని రెండో హెచ్చరికపై రాసి ఉంటుంది. 

3 /6

New Warning on Cigarettes: ఈ రెండు హెచ్చరికల్లో తొలి హెచ్చరిక ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఏడాది పాటు అమలులో ఉండనుంది.

4 /6

New Warning on Cigarettes: అలాగే రెండో హెచ్చరిక వచ్చే ఏడాది డిసెంబర్ 1 నుంచి ఆ తర్వాత ఏడాదిపాటు అమలులో ఉండనుంది.

5 /6

New Warning on Cigarettes: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీతో పాటు నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రాం అధికారిక వెబ్‌సైట్లలో (www.mohfw.gov.in మరియు ntcp.nhp.gov.in ) ఈ హెచ్చరికలకు సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం 19 భాషల్లో అందుబాటులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది.

6 /6

New Warning on Cigarettes: కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త హెచ్చరికలను చూసి అప్రమత్తం అయిన వాళ్లు ఎవరైనా ఇక పొగాకు అలవాట్లు మార్చుకోవాల్సిందే అనేలా హెచ్చరికలు ఉన్నాయి.