Chennai Super Kings: మెగా వేలానికి ముందు ఈ ఆటగాళ్లకు చెన్నై సూపర్ కింగ్స్ టాటా.. ఎందుకంటే..?

IPL 2025 Mega Auction: ఐపీఎల్-17 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్లను విడుదల చేయనున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు బెస్ట్ ప్లేయర్లను తమ టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.  
 

1 /8

ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా వేలం, ప్రతి ఏడాది మినీ వేలం నిర్వహిస్తారు. అందుకు తగినట్లు ఆయా జట్ల యజమాన్యాలు తమ ఆటగాళ్లను మార్చుకుంటున్నాయి.  

2 /8

బిడ్డింగ్‌కు ముందే అన్ని జట్లు తాము వద్దనుకున్న ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేస్తాయి.  

3 /8

2022 మెగా వేలానికి ముందు ప్రతి జట్టుకు నలుగురు ప్లేయర్లను కొనసాగించుకునే అవకాశం ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కీలక ఆటగాళ్లను వదులుకునే అవకాశం ఉంది.   

4 /8

దీపక్ చాహర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. గత వేలంలో సీఎస్‌కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. పవర్ ప్లేలో మాత్రమే స్పెషలిస్ట్ కాగా.. డెత్ ఓవర్లలో చాహర్ తేలిపోతున్నాడు. దీనికి తోడు తరచూ గాయాలపాలవ్వడంతో టీమ్‌కు ఇబ్బందిగా మారుతోంది.    

5 /8

డారిల్ మిచెల్‌ను కూడా చెన్నై రిలీజ్ చేసే అవకాశం ఉంది. మినీ వేలంలో రూ.14 కోట్లు చెల్లించింది. మెగా వేలంలో తక్కువ ధరకు తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నించవచ్చు.   

6 /8

2022 మెగా వేలానికి ముందు శార్దుల్ ఠాకూర్‌ను రిలీజ్ చేసిన సీఎస్‌కే.. 2024 మినీ వేలంలో రూ.4 కోట్లకు తిరిగి తీసుకుంది. అయితే బౌలింగ్‌, బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపంచలేకపోవడంతో జట్టు నుంచి విడుదల చేసే ఛాన్స్ ఉంది.   

7 /8

చెన్నై సూపర్ కింగ్స్ 2021, 2023లో ఛాంపియన్‌గా నిలవడంలో మొయిన్ అలీ కీరోల్ ప్లే చేశాడు. అయితే ఈ సీజన్‌లో ఆశించినస్థాయిలో ఆడలేదు. మెగా వేలానికి ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది.   

8 /8

సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానేను 2023 ఐపీఎల్ సీజన్‌కు ముందు సీఎస్‌కే తీసుకుంది. గత సీజన్‌లో అదరగొట్టిన రహానే.. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.