CSK Big Plan: ముగ్గురు స్పిన్నర్లపై చెన్నై కన్ను.. వీరిని దక్కించుకుంటే ఐపీఎల్ ట్రోఫీ పక్కా

Chennai Super Kings Big Plan For IPL 2025 Mega Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రానున్న లీగ్‌కు సిద్ధమవుతోంది. స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన చెన్నై జట్టు వచ్చే సీజన్‌కు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్‌లో స్పిన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు ప్రణాళిక రచిస్తోంది.

1 /8

సీఎస్కే ప్రత్యేకం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సీఎస్కే జట్టు చరిత్ర ప్రత్యేకమైనది. ఇప్పుడు రాబోయే సీజన్ కు సీఎస్కే సిద్ధమైంది. ఈ క్రమంలో స్పిన్నింగ్ దళంపై దృష్టి సారించింది.

2 /8

గత సీజన్ లో తప్పిదం?: రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలు సక్రమంగా చేపట్టినా కూడా మహేంద్ర సింగ్‌ ధోనీపై అందరి దృష్టి ఉంది. గత సీజన్‌లో స్పిన్నర్లను ధోని మాదిరిగా రుతురాజ్‌ వినియోగించుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీనివలన జట్టు కొంచెం మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో వెనుకబడింది.

3 /8

స్పిన్ పై దృష్టి: ఈసారి స్పిన్‌ను బలోపేతం చేయడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దృష్టి సారించినట్లు సమాచారం. చెపాక్‌లోనే కాకుండా ఇతర స్టేడియంలలో కూడా తిరుగులేని జట్టుగా రాణించాలని భావిస్తోంది. 

4 /8

వదులుకునేది వీరే: వచ్చే సీజన్‌ కోసం దీక్షా, మొయిన్ అలీ, సాంట్నర్‌ను సీఎస్‌కే వదులుకునే అవకాశం ఉంది. కొత్త స్పిన్ దళాన్ని నిర్మించాలని చెన్నై యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

5 /8

ఖాళీ స్థానంలో..: రాబోయే ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఖాళీ అయిన ముగ్గురు స్పిన్నర్ల స్థానంలో యువ స్పిన్నర్లను తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. 

6 /8

సికందర్ రజా: పంజాబ్ కింగ్స్ సికిందర్‌ రజాను వదులుకునే అవకాశం ఉంది. వాళ్లు అలా వదులుకున్నారో లేదో ఇలా తమ జట్టులోకి తీసుకునేందుకు సీఎస్‌కే సిద్ధంగా ఉంది. మిస్టరీ స్పిన్నర్‌గా పేరొందిన సికిందర్ రజాను తీసుకునేందుకు చెన్నై ఆసక్తి చూపుతుంది. తీక్షణను వదులుకుంటే ఆ స్థానంలో రజాను భర్తీ చేసే అవకాశం ఉంది.

7 /8

రవిచంద్రన్ అశ్విన్: క్రికెట్ ప్రపంచానికి రవిచంద్రన్‌ అశ్విన్‌ను సీఎస్కే పరిచయం చేసింది. 2016, 2017లో ధోనీతో పాటు అదే రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ జట్టులో అశ్విన్ కొనసాగాడు. కానీ 2018లో రవిచంద్రన్ అశ్విన్‌ను వేలంలో చెన్నై తీసుకోలేదు. తర్వాత పంజాబ్, ఢిల్లీ వెళ్లిన అశ్విన్ ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్నాడు. ఈసారి మెగా వేలంలో‌ అశ్విన్‌ వస్తే మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు. అశ్విన్ ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అవకాశం.

8 /8

ఎం. సిద్ధార్థ్: జడేజా ఎడమచేతి వాటం స్పిన్నర్ అయినప్పటికీ పవర్‌ప్లేలో చెన్నైకి స్పిన్నర్ అవసరం కావచ్చు. ఈ క్రమంలో ఎల్‌ఎస్‌జీలో ఉన్న తమిళనాడు ఆటగాడు ఎం సిద్ధార్థ్‌ను వేలం వేయడానికి సీఎస్‌కే ప్రయత్నిస్తుంది. ఈ వేలంలో సాయి కిషోర్ కూడా ఉన్నా కూడా సిద్ధార్థ్‌ వైపు చెన్నై యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది.