Business ideas: ఈ కోళ్లను పెంచి..అమ్మితే ఎంత లాభమో తెలుసా? సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కు మించిన ఆదాయం మావా

Business ideas: ఈ కోళ్లను పెంచితే నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందట. ఇంతకీ ఏం కోళ్లు అవి. ఎలా పెంచుతున్నారు. ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

1 /8

Business ideas: మాంసం ప్రియులకు నాటుకోడి పేరు చెబితే చాలు నోట్లో నీళ్లూరుతాయి. మసాలా దండించి వండిన నాటుకోడి కూర నోరూరిస్తుంది. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతికి కోడి పందాలకు నాటు కోడికి మంచి గిరాకీ ఉంటుంది.   

2 /8

 చాలా మంది పందాల కోసం నాటుకోళ్లను పెంచుతుంటారు. వాటికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఆ ఖర్చుకు డబుల్ లాభాలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రకాన్ని బట్టి ఒక్కో కోడి ధర రూ. 50వేల నుంచి లక్ష వరకు ఉంటుంది.  

3 /8

కానీ తెలంగాణలో వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి మాత్రం సరదా కోసం నాటు కోళ్లను పెంచుతూ లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. చాలా మంది పందెం కోసం మాత్రమే నాటుకోళ్లను పెంచుతుంటారనే భావనలో ఉంటారు.   

4 /8

వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెందిన గురునందన్ రెడ్డి కొన్నేళ్లుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆసిల్ జాతి కోళ్లను పెంచుతున్నాడు. వాటి తిండికి లక్షల్లో ఖర్చు చేస్తుంటాడు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆయన వ్యవసాయంతోపాటు కోళ్ల పెంపకంపై కూడా ఫోకస్ పెట్టాడు. దీంతో రకరకాల కోళ్లను పెంచుతున్నాడు.   

5 /8

చిలకముక్కు, నెమలి తోక, పొడవాటి మెడ, బలమైన శరీరం ఉన్న అసిల్ జాతికోళ్లకు బాగా డిమాండ్ ఉందని తెలుసుకున్నారు. దీంతో 2007లో లక్ష రూపాయలు వెచ్చింది రెండు జతల పిల్లలను తీసుకువచ్చాడు. అవి పెరిగి పెద్దగా పెరిగి మళ్లీ పిల్లలు పెట్టింది.   

6 /8

ఇలా ఇంటి ఆవరణలో అసిల్ జాతి కోళ్లు చాలా పెరిగాయి. వీటిని కొనుగోలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా మంది వస్తున్నారని గురునందన్ రెడ్డి చెబుతున్నారు.  

7 /8

 ఇప్పటి వరకు తన వద్ద పెరిగిన కోళ్లను రూ. 50వేలకు అమ్మినట్లు తెలిపారు. తనకు నచ్చిన కోళ్లను రూ. లక్షల వరకు అమ్మానని తెలిపారు.   

8 /8

ప్రస్తుతం ఆయన వద్ద చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 50కిపైగా అసిల్ కోళ్లు ఉన్నట్లు వెల్లడించారు.