Bollywood actresses: సినీరంగంలో అగ్రనటీమణులు, చదువు మాత్రం తక్కువే

బాలీవుడ్ ప్రముఖ నటీమణుల విద్యార్హతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలమంది కనీసం కళాశాల చదువు కూడా చదువుకోలేదు. 12వ తరగతితో చదువు ఆపేసి..సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి..హల్‌చల్ చేస్తున్నారు. కళాశాల చదువు కూడా లేని కొంతమంది బాలీవుడ్ నటీమణుల గురించి తెలుసుకుందాం.

Bollywood actresses: బాలీవుడ్ ప్రముఖ నటీమణుల విద్యార్హతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలమంది కనీసం కళాశాల చదువు కూడా చదువుకోలేదు. 12వ తరగతితో చదువు ఆపేసి..సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి..హల్‌చల్ చేస్తున్నారు. కళాశాల చదువు కూడా లేని కొంతమంది బాలీవుడ్ నటీమణుల గురించి తెలుసుకుందాం.
 

1 /5

ముంబైలోని ఆర్య విద్యా మందిర్ లో 12 వ తరగతి వరకూ చదువుకున్న సోనమ్ కపూర్..డిగ్రీ కోసం అడ్మిషన్ తీసుకుంది. కానీ మధ్యలో చదువు ఆపేసి..సినిమా రంగంలో ప్రవేశించింది. ఓ ఇంటర్వ్యూలో మాత్రం 12వ తరగతి మద్యలో నిలిపివేశానని చెప్పింది.

2 /5

మరో వివాదాస్పద నటి రాఖీ సావంత్. అసలు పేరు నీరూ భేదా. ఈమె కళాశాల వరకూ చదువుకున్నా..ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నుంచి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు మాత్రం చదువుకోలేదని చెప్పింది. 

3 /5

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ . ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా 12వ తరగతి దాటలేదు. కనీసం 12వ తరగతి పాసవుట్ కూడా కాలేదు. 

4 /5

ప్రస్తుతం అప్ కమింగ్, ట్రెండీ హీరోయిన్ అనన్యా పాండే. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అనన్యా కూడా కేవలం 12వ తరగతి వరకే చదువుకుంది. 

5 /5

మెగా హిట్ ఫిల్మ్స్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ నటి అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో సినిమా రంగంలో ప్రవేశించిన అలియా స్కూల్ నుంచే సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆఫర్లు అధకమవడంతో 12వ తరగతితో ఆపేసింది.