Biperjoy cyclone Pics: గుజరాత్లో బిపర్జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, రాకాసి అలలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రాకాసి అలలు గుజరాత్లోని ఓ వంతెనను సైతం మింగేస్తున్న దృశ్యాలు భయపెడుతున్నాయి. రాత్రికి పరిస్థితి మరింత విషమించవచ్చని అంచనా.
Biperjoy cyclone Pics: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను ఇప్పటికే తీరం తాకేసింది. గుజరాత్ కచ్ సమీపంలో ప్రారంభమైన తీరం దాటే ప్రక్రియ పాకిస్తాన్ కరాచీ తీరం వరకూ కొనసాగనుంది. సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తును ఎగసిపడుతున్నాయి. 3-4 మీటర్ల ఎత్తులో రాకాసి అలలు వచ్చి పడుతున్నాయి.
కచ్, కరాచీ తీరాల్ని అతలాకుతలం చేస్తున్న బిపర్జోయ్ ధాటికి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రాకాసి కెరటాలు వంతెనను మింగేస్తున్న వీడియో చూస్తే చాలు..పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బిపర్జోయ్ తుపానును అత్యంత తీవ్ర తుపానుగా పరిగణిస్తున్నారు. గుజరాత్ కచ్ తీరంతో పాటు ద్వారక, జామ్నా నగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊహించినట్టే బలమైన ఈదురుగాలులు విధ్వంసం రేపుతున్నాయి.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మొత్తం చీకటి అలముకుంది. ద్వారకా, ఒఖా, నాలియా, భుజ్ పోరుబందర్, కాండ్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఇప్పటికే లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గుజరాత్ కచ్ తీరంలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.
కచ్ జిల్లా జఖౌ ఓడరేవుకు సమీపంలో మాండ్వి, పాకిస్తాన్ కరాచీ మధ్యలో తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బిపర్జోయ్ తుపాను కారణంగా గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.