Best Weight loss Diet: బరువు తగ్గించేందుకు మఖనా లేదా వేరుశెనగ ఏది బెస్ట్

బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా డైట్‌లో హెల్తీ ఫుడ్స్ ఉండేలా చూసుకుంటారు. వీటిలో కొంతమంది మఖనా ఎంచుకుంటే మరి కొంతమంది వేరుశెనగ తీసుకుంటారు. కానీ బరువు తగ్గేందుకు రెండింట్లో ఏది మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Best Weight loss Diet: బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా డైట్‌లో హెల్తీ ఫుడ్స్ ఉండేలా చూసుకుంటారు. వీటిలో కొంతమంది మఖనా ఎంచుకుంటే మరి కొంతమంది వేరుశెనగ తీసుకుంటారు. కానీ బరువు తగ్గేందుకు రెండింట్లో ఏది మంచిదనేది ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /5

మఖనా వర్సెస్ వేరుశెనగ మఖనా, వేరుశెనగ రెండింటినీ హెల్తీ స్నాక్స్ కింద వాడవచ్చు. బరువు తగ్గించే క్రమంలో ముందుగా మీరు ఎంత బరువు తగ్గించుకోవాలో నిర్ణయించుకోవాలి. దానిని బట్టి వేరు శెనగ లేదా మఖనా అనేది ఎంచుకోవాలి. 

2 /5

ప్రోటీన్లు ఎందులో ఎక్కువ వేరుశెనగలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కానీ ప్రోటీన్ కావాలంటే మాత్రం వేరుశెనగే బెస్ట్. మఖనాలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. 

3 /5

ఫైబర్ ఎందులో ఎక్కువ ఇక డైట్‌లో ఫైబర్ అధికంగా ఉండాలనుకుంటే మఖనా మంచి ఆప్షన్. వేరుశెనగతో పోలిస్తే మఖనాలోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపుకు కూడా మంచిది

4 /5

కేలరీలు ఎందులో ఎక్కువ బరువు తగ్గించే క్రమంలో ప్రధానంగా చూడాల్సింది కేలరీలు. ఈ విషయంలో వేరుశెనగ కంటే మఖనా బెటర్. మఖనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశెనగలో కొద్దిగా ఎక్కువ కేలరీలు ఉంటాయి. 

5 /5

మఖనా, వేరుశెనగ లాభాలు వేరుశెనగలో ప్రోటీన్లు, ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. మఖనాలో యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి.