Best Tourist Places: మండు వేసవిలో ఎక్కడికైనా సందర్శించాలంటే జూన్ నెల మంచి సమయం. అందమైన హిల్ స్టేషన్లు, మనోహరమైన ప్రాంతాలు సందర్శించేందుకు అనువైంది. దేశంలోని టాప్ 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ టీ తోటల అందాలు, అద్భుతమైన పర్వత ప్రాంతాలు ఎంజాయ్ చేయాలంటే డార్జిలింగ్ సరైన ప్రాంతం. ప్రపంచ విఖ్యాత టాయ్ ట్రైన్ జర్నీ ఇంకా బాగుంటుంది
కున్నూర్, తమిళనాడు హిల్ స్టేషన్లు సందర్శించేందుకు కున్నూర్ బెస్ట్ ప్లేస్. నీలగిరి పర్వతాల్లో ఉన్న కున్నూర్ టీ తోటల్ని తప్పకుండా సందర్శించాల్సి వస్తుంది.
కశ్మీర్ భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్ సందర్శించేందుకు కూడా జూన్ నెల సరైన సమయం. దాల్ సరస్సు అద్భుతమైన అందాలు ఎంత చూసినా తనివితీరదు. గుల్మార్గ్ కూడా మరో మంచి టూరిస్ట్ ప్లేస్.
మూన్శ్యారీ-ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్‌లోని మూన్ శ్యారీ ప్రశాంతతకు, అందానికి ప్రతీతి. జూన్ నెలలో ఇక్కడి వాతావరణం మరింత బాగుంటుంది. హిమాలయ అందాలు సందర్శించేందుకు మంచి ప్రదేశమిది.
మనాలీ-హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కొండల అందం ఎంతచూసినా తనివి తీరదు. జూన్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ ఎంజాయ్ చేయవచ్చు. హిమాచల్ లోయల్లో ట్రెక్కింగ్ అనుభూతి పొందవచ్చు.