Glass Bridges: ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించే గ్లాస్ బ్రిడ్జీలపై తిరగడం అంటే నిజంగానే అద్భుతమైన థ్రిల్. చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే మొన్నటి వరకూ అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లోనే ఇవి ఉండేవి. ఇప్పుడు ఇండియాలో కూడా గ్లాస్ బ్రిడ్జిలు వచ్చేశాయి. ఇండియాలో ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం.
పర్యాటకం ఇండియాలో గ్లాస్ బ్రిడ్జిలు నిర్మించిన ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది.
చిత్రకూట్ ఉత్తరప్రదేశ్‌లో నిర్మించి తొలి గ్లాస్ బ్రిడ్జి ఇది. రాముని ధనస్సు ఆకారంలో ఉంటుంది. ఈ వంతెన పొడవు 25 మీటర్లు ఉంటుంది. ధనస్సు వెడల్పు 35 మీటర్లు. 500 కిలోల వరకూ బరువు నియంత్రించగలదు. ఈ ఏడాది ఇది పూర్తి కావచ్చు.
వాయనాడ్ గ్లాస్ బ్రిడ్జి, కేరళ కేరళలోని వాయనాడ్ జిల్లా పర్యాటకంగా అందరికీ తెలిసిందే. చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది. ఇక్కడ నిర్మించి గ్లాస్ బ్రిడ్జి పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. హోటల్ 900 కాండీ సారధ్యంలో ఉంది
రాజ్‌గీర్ గ్లాస్ బ్రిడ్జి, బీహార్ బీహార్‌లోని నలందా జిల్లాలో స్కై వాక్ ఎంజాయ్ చేసే అద్భుత ప్రదేశం. రాజ్‌గీర్ ప్రాంతంలో ఉంది. ఈ వంతెన పొడవు 85 అడుగులుంటుంది. 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవల్సి ఉంటుంది.
స్కై వాక్ పోలింగ్-సిక్కిం సిక్కిం అంటేనే అందమైన హిల్స్, లోయ ప్రాంతాలు, మంచుతో నిండి ఉండే ప్రదేశాలు. ఇక్కడ నిర్మించి గ్లాస్ బ్రిడ్జి పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకుంటోంది. గ్యాల్‌శింగ్ జిల్లాలో నిర్మించి స్కై వాక్ పోలింగ్ సముద్రమట్టం నుంచి ఏకంగా 7200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉదయం 8 గంటల్నించి సాయంత్రం 5 గంటలవరకూ తెరిచి ఉంటుంది.