Top Romantic Places: ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. మరి కొద్దిరోజుల్లో వేసవి సెలవులుంటాయి. ఈ క్రమంలో సమ్మర్ వెకేషన్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌తో లేదా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అద్భుతంగా ఎంజాయ్ చేసేందుకు మంచి అనుభూతినిస్తాయి.
లడాఖ్ లడాఖ్ ఓ అందమైన, ప్రత్యేకమైన ప్రాంతం. ఎత్తైన పర్వతాలు, మంచు కురిసే ఎడారి ప్రాంతాలు, ప్రశాంత వాతావరణంతో పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అత్యంత అందమైన ప్రాంతం. అందమైన టీ తోటులు, పచ్చపచ్చని కొండ ప్రాంతాలు, టాయ్ ట్రైన్ వంటివి మీ ప్రయాణాన్ని అందమైన అనుభూతిగా మలుస్తాయి.
మసూరీ, ఉత్తరాఖండ్ మసూరీని కొండలకు రాణిగా పిలుస్తారు. అంత అందమైన ప్రదేశాలుంటాయి. పచ్చపచ్చని కొండలు, అందమైన సరస్సులకు మసూరీ చాలా ప్రసిద్ధి. ఏకాంతంగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు చాలా అనువైన ప్రాంతమిది.
నైనితాల్, ఉత్తరాఖండ్ నైనీ సరస్సు, కొండ ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి నైనితాల్. అందమైన ప్రాంతాలకు ఇక్కడ కొదవ లేదు. మీక్కావల్సినవారితో గడిపేందుకు ఇంతకంటే మంచి ఏకాంతమైన ప్రదేశం ఉండకపోవచ్చు.
మనాలీ, హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం మనాలీ. మంచు కురిసే కొండలు, సాహసోపేతమైన థ్రిల్లింగ్ అడ్వంచర్లు, ప్రశాంత వాతావరణం అన్నింటికీ మనానీ కేరాఫ్ అడ్రస్.