గాల్వన్ లోయలో భారతీయ సైనికులను చైనా ఆర్మీ దొంగదెబ్బతీసి పొట్టన పెట్టుకున్న తర్వాత నుంచి చైనాపై భారతదేశంలో వ్యతిరేకత మొదలైంది. ఇకనుంచి చైనా మొబైల్స్ కొనవద్దని స్మార్ట్‌ఫోన్ యూజర్లు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం చైనా యాప్స్‌పై భారత్‌లో నిషేధించింది. నాన్ చైనా స్మార్ట్ఫోన్లు కొనాలనుకునే వినియోగదారులకు బడ్జెట్ ధర (Best non Chinese smartphones under Rs 10000)లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం.
గాల్వన్ లోయలో భారతీయ సైనికులను చైనా ఆర్మీ దొంగదెబ్బతీసి పొట్టన పెట్టుకున్న తర్వాత.. ఇకనుంచి చైనా మొబైల్స్ కొనవద్దని స్మార్ట్‌ఫోన్ యూజర్లు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం చైనా యాప్స్‌పై భారత్‌లో నిషేధించింది. నాన్ చైనా స్మార్ట్ఫోన్లు కొనాలనుకునే వినియోగదారులకు బడ్జెట్ ధర (Best non Chinese smartphones under Rs 10000)లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు మీకోసం.
శాంసంగ్ గెలాక్సీ M01 కోర్ మొబైల్.. రూ.5,499 నుంచి ధర ఉంటుంది. (1GB RAM+2GB). ఇందులో 2GB RAM+32GB మోడల్ ధర రూ.6,499.
శాంసంగ్ గెలాక్సీ M01s ప్రారంభ ధర రూ.9,499. ఈ మొబైల్ 6.2 అంగుళాల తెరతో పాటు ఇన్ఫినిటీ-వి డిస్లే దీని ప్లస్ పాయింట్.
పానసోనిక్ Eluga I8 ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో అయితే ధర రూ.8,143, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ధర రూ.8,183 చెల్లించి ఈ పానసోనిక్ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.
నోకియా సీ3 మొబైల్స్ రెండు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 2GB/16GB వేరియంట్ ధర రూ.7,499. కాగా, 3GB/32GB వేరియంట్ ధర రూ.8,999.
లావా జెడ్66 ఈ ఆగస్టులో లాంచ్ చేశారు. దీని ధర రూ.7,777గా నిర్ణయించారు. 1.6GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 6.08 అంగుళాల హెచ్డీ ప్లస్ నాచ్ డిస్ప్లే దీని ప్రత్యేకత. 2.5D కర్వ్డ్ స్క్రీన్ 19:9 నిష్పత్తిలో వస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మొబైల్ రూ.7,999 ధరలకు అందుబాటులో ఉంది. 6.82 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే దీని ప్రత్యేకత. 3 GB RAM + 32 GB మెమరీని 256 GB వరకు పొడిగించుకోవచ్చు.