Regu Pallu: వావ్.. చాలా మందికి తెలియని రేగు పండ్ల పచ్చడి.. ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు..

Ber fruits: చలికాలంలో రేగు పండ్లు ఎక్కువగా మార్కెట్ లోకి వస్తుంటాయి. దీంతో జనాలు ఈ పండ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.  దీనిలోన పుష్కలమైన ప్రయోజనాలు కల్గుతాయి.
 

1 /6

సాధారణంగా పెద్దలు ఏ సీజన్ లలో దొరికే ఫ్రూట్స్ ను ఆ సీజన్ లో తినాలని చెప్తుంటారు. దీనివల్ల అనేక రుగ్మతలనుంచి బైట పడొచ్చు. అంతేకాకుండా.. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని చెప్పుకొవచ్చు.

2 /6

రేగు పండ్లను తినడం వల్ల అనేక ఉపయోగాలు కల్గుతాయి. జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతే కాకుండా.. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతుంటారు  

3 /6

అయితే.. రేగు పండ్ల ఆవకాయను తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి ఆవకాయలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా మార్కెట్ నుంచి రేగు పండ్లను తెచ్చుకుని గోరు వెచ్చని నీళ్లలో వేసి క్లీన్ గా కడగాలి.

4 /6

మరోవైపు కడయిలో నూనె పోసి..  దానిలో ఆవాలు, జీలకర్ర,మిర్చి ముక్కలు, కరివేపాకు మొదలైనవి వేయాలి. అంతేకాకుండా.. మరో గిన్నెలో.. రేగు పండ్లను తీసుకుని దానిలో..దాని తొడిమలను మాత్రం తీసేయాలి.  

5 /6

ఆతర్వాత.. దాని మీద కారం, ఉప్పు, వెల్లుల్లీ పేస్ట్ ను వేయాలి. దీనిపై.. కడయ్ లో రెడీగా ఉన్న నూనె మిగత పదార్థాలను.. ఈ గిన్నెలోకి రేగు పండ్ల మీద వేసి చక్కగా మిక్స్ చేయాలి.

6 /6

ఇలా చేసిన తర్వాత రేగు పండ్ల గిన్నెను ఒక రోజు జాగ్రత్తగా మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత.. మరో రోజుకూడా ఈ రేగు పండ్లను జాగ్రత్తగా కారం, ఉప్పు సరిగ్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొవాలి. ఇంకేం రుచికరమైన టెస్టీ.. రేగు పండ్ల పచ్చడి రెడీ..