Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులు

Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్‌ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. డిసెంబర్‌ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం. డిసెంబర్‌లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.

1 /9

మరో ఏడాదికి బైబై: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. డిసెంబర్‌ ప్రారంభమవుతుండడంతో ఈనెలలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.

2 /9

సెలవుల జాబితా: బ్యాంకు సెలవులను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. జాతీయంతోపాటు (పబ్లిక్‌ హలీడే) ప్రాంతీయంగా కొన్ని సెలవులు ఉంటాయి.

3 /9

ఖాతాదారులకు అలర్ట్‌: డిసెంబర్‌లో అన్ని సెలవులు కలిపి 17 రోజులు ఉన్నాయి. దీంతో బ్యాంకులు ఉద్యోగులు పండుగ చేసుకోవచ్చు. ఖాతాదారులు మాత్రం ముందే తమ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంది.

4 /9

రెగ్యులర్‌ సెలవులు: డిసెంబర్‌లో 5 ఆదివారాలు (1, 8, 15, 22, 29) రాగా.. రెండు, నాలుగో శనివారం (14, 28)తో కలిపి ఏడు రోజులు సెలవులు వచ్చాయి.

5 /9

ఆరోజు ప్రపంచవ్యాప్తంగా: డిసెంబర్‌ 25వ తేదీ (బుధవారం) క్రిస్మస్‌ పండుగ. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

6 /9

ప్రాంతీయంగా: ఇక ఆయా ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న పండుగలు, ప్రాధాన్యాలు, జయంతులు, వర్ధంతులు కలిపి అక్కడక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

7 /9

తెలుగు రాష్ట్రాల్లో: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికారికంగా 8 రోజులు సెలవు ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉండే సెలవులతోపాటు అదనంగా క్రిస్మస్‌ సెలవు లభించింది.

8 /9

ప్రణాళిక చేసుకుంటే: 2024 సంవత్సరం ముగిసిపోతుండడంతో ఈ ఏడాదిని మరపురాని జ్ఞాపకంగా మలచుకునేందుకు బ్యాంకు ఉద్యోగులకు ఈ సెలవులు దోహదం చేయనున్నాయి. పక్కా ప్రణాళిక చేసుకుంటే అదనంగా రెండు మూడు రోజులు సెలవులు తీసుకుంటే ఈ ఏడాదికి అద్భుతంగా ముగింపు పలకవచ్చు.

9 /9

సేవలకు అంతరాయం: బ్యాంకు సెలవులను పరిగణనలోకి తీసుకుని ఖాతాదారులు తమ బ్యాంకు సేవలను ముందే ప్రణాళికగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.