Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి ఎప్పుడు..? విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా.. ఆ రోజున ఏం చేయాలంటే..?

Dev shayani Ekadashi Festival 2024: ఆషాడ శుధ్ద ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు ఈరోజున యోగనిద్రలోకి వెళ్తారని చెబుతుంటారు. అందుకే నాలుగు నెలల పాటు చాతుర్మస్య వ్రతం కూడా నిర్వహిస్తారు.

1 /6

ఆషాడ మాసాన్ని చాలా మంది శూన్య మాసమని అంటారు. కానీ ఈ మాసంలో అనేక పండుగలు వరుసగా వస్తుంటాయి. ముఖ్యంగా ఆషాడంలో బోనాలు, పెళ్లైన మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేసుకుంటారు. తొలి ఏకాదశి వ్రతం, నాగపంచమి, రాఖీ పూర్ణిమ, జగన్నాథుడి రథయాత్ర,శుక్రవారం గౌరీ వ్రతం ఇలా అన్ని కూడా ఆషాడంలోనే ఉంటాయి.

2 /6

ఆషాడంలో తొలి ఏకాదశిని చాలా మంది భక్తితో జరుపుకుంటారు. ఈరోజున చాలా మంది విష్ణుదేవుడి అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు. మరుసటి రోజు ద్వాదశి తిథిలో మాత్రమే భుజిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తరని చెబుతుంటారు. అందువల్లనే..  ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు.అందుకే.. ఈ నాలుగు నెలలు కూడా ఎలాంటి శుభ కార్యాలని నిర్వహించరు. 

3 /6

తొలి ఏకాదశినే,  దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.  హిందువులు మాత్రమేకాకుండా.. ఈ రోజుకి  జైనులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు.   జైనులకు కూడా  చాతుర్మాసం వ్రతం చేస్తారు. అంటే  ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ఎక్కడికి కూడా ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి వారి దేవుడిని ఆరాధిస్తారు.

4 /6

నెలకు రెండు ఏకాదశిలువస్తాయి. అవి ఒకటి కృష్ణ , శుక్ల పక్ష ఏకాదశులు. ఈ సారి తొలి ఏకాదశి  లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 వ తేదీ  మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. అంటే... బుధవారం నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి జులై 17 న బుధవారం ఏకాదశిని జరుపుకొవాలని పండితులు సూచిస్తున్నారు.

5 /6

తొలి ఏకాదశి రోజున ఏ చిన్న పని చేసిన అది వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తుంది.  అందుకే ఈరోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. కేవలం పండ్లు, పాల మీదనే ఉపవాసం ఉంటారు. పెళ్లికానీవారు, జీవతంలో సెటిల్ మెంట్ లేని వాళ్లు ఈ రోజున విష్ణు భగవానుడిని భక్తితో పూజించుకొవాలని చెప్తుంటారు.

6 /6

తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే..తలస్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. శ్రీహరికి తులసీదళాలు,పూలు అంటే ఎంతో ఇష్టం. అందుకే రకరకాలపూలను సమర్పించుకొవాలి. రోజంతా దేవుడి పేరు స్మరిస్తు, అందరిలో చక్కగా మాట్లాడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. ఈరోజున వెంట్రుకలు కట్ చేయడం, గోర్లు తీసుకొవడం వంటివి చేయకూడదు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)