New Smartphones: మీరు ఏదైనా మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే వివో, ఒప్పో, రియల్‌మి, శాంసంగ్, మోటోరోలా కంపెనీలు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ లాంచ్ చేశాయి.
New Smartphones: మీరు ఒకవేళ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే..ఇదే మంచి అవకాశం. మార్కెట్‌లో ఇటీవలే కొత్త మోడల్స్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. వివో, ఒప్పో, రియల్‌మి, శాంసంగ్, మోటోరోలా వంటి కంపెనీలు పలు మోడల్స్ ఆవిష్కరించాయి. అవేంటో తెలుసుకుందాం..
Vivo V23e 5G ఈ స్మార్ట్‌ఫోన్ ధర 25 వేల 990 రూపాయలు. 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరాతో అద్భుతంగా ఉంది. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌తో..8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంది. మరో 2 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు.
Samsung Galaxy A03 ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 10 వేల 499 రూపాయలకు లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కలిగి ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఫోన్‌గా వచ్చింది. మరో వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.
Realme Narzo 50 ఈ ఫోన్ ఇండియాలో రెండు ర్యామ్ కెపాసిటీలతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అయితే 12 వేల 999 రూపాయలుగా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 15 వేల 499 రూపాయలుగా ఉంది.
Oppo Find X5 Pro ఒప్పో లాంచ్ చేసిన ఈ మోడల్ ఫోన్ ఇంకా ఇండియాలో లాంచ్ కావల్సి ఉంది. దీని ధర 1299 యూరోలు కాగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 5 మాత్రం 999 యూరోలుగా ఉంది. గ్లేజ్ బ్లాక్, సిరామిక్ వైట్ రంగుల్లో ప్రపంచ మార్కెట్లో లభిస్తోంది.
Motorola Edge 30 Pro ఈ స్మార్ట్‌ఫోన్ ధర 49 వేల 999 రూపాయలుగా ఉంది. మార్చ్ 4 నుంచి ఈ ఫోన్ అందుబాటులో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌పై లభ్యం కానుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది.
Iqoo 9 ఐక్యూ 9 ప్రో, ఐక్యూ 9, ఐక్యూ 9 ఎస్ఈ వేరియంట్ స్మార్ట్‌ఫోన్లు 4 ఎన్ఎం స్నాప్ డ్రాగన్తో 8వ జనరేషన్ చిప్‌సెట్ కలిగి ఉంది. 12 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ధర 64 వేల 990 రూపాయలుగా ఉంది. అదే 12 జీబీతో 69 వేల 990 రూపాయలుగా ఉంది. ఇక ఐక్యూ 9 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 42 వేల 990 రూపాయలు కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అయితే 46 వేల 990 రూపాయలుగా ఉంది.