Punugulu recipe: చాలా మంది వర్షం పడగానే ఏదో ఒకటి వేడి వేడి పదార్థాలను తినాలనుకుంటారు. కొందరు కట్లేట్, గప్ చుప్ లు, మరికొందరు బజ్జీలు, పునుగులను తింటుంటారు. కానీ వర్షాకాలంలో బైటి ఫుడ్ తింటే పొట్టపాడౌతుంది.
వర్షాకాలంలో రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఏదో ఒక వేడి వేడి పదార్ధాలను తినాలని పిస్తుంటుంది. కానీ అందరు బైట ఫుడ్ మాత్రం తినరు. వీరికి ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టంతో తింటుంటారు.
ఇలాంటి నేపథ్యంలో.. పునుగులంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. దీన్ని ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు చెనగపిండితో కూడా బజ్జీలు, పునుగులు చేస్తుంటారు.
ముందుగా చెనగపిండిని మంచిగా గిన్నెలో నీళ్లు వేసుకుని నానబెట్టాలి. ఆ తర్వాత దీనిలో జీలకర్ర, ఉప్పు, కారం,పసుపు, ఓమా,కరివేపాకులను, మిర్చిముక్కలు, ధనియా పొడిలను సమపాళ్లలో వేయాలి.
వీటన్నింటిని చక్కగా కలుపుకుని కొన్ని నిముషాలు అలానే ఉంచేయాలి . అప్పటి దాక.. గ్యాస్ మీద కడయ్ పెట్టుకుని దానిలో నూనెను వేయాలి. ఆ నూనె వేడి అయ్యే వరకు కూడా అలానే ఉంచాలి. అప్పుడు దానిలో గిన్నెలు మిక్స్ చేసుకున్న.. బజ్జీల పిండి ముద్దలను మెల్లగా నూనెలో వేయాలి..
ఇలా వేయగానే బజ్జీలు, పునుగులు ఒక్కసారిగా సల సలకాగుతాయి. ఇలా కాగిన తర్వాత.. జాలీ గంటతో కాస్త అటు ఇటు తిప్పాలి. ఆతర్వాత పునుగులను జాలీగంటతో మరోక గిన్నెలో తీయాలి.నూనె అంతా అడుగున వెళ్లే వరకు ఆగాలి.
ఆ తర్వాత టమాటా సాస్, ఆనియన్స్, చింత పండు చట్నీలు మొదలైనవి వేసుకుని పునుగులను వర్షంలో ఎంతో ఎంజాయ్ చేస్తు తినేయోచ్చు. దీన్ని కేవలం అతి తక్కువ సమయంలో ఈజీగా ఇలా చేయోచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)