AP Schools Summer Holidays: ఏపీలో సమ్మర్ హలీడేస్ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం..


Ap Government: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమ్మర్ సెలవులను ఒకరోజు పోడిగిస్తు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

1 /6

ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 12 తో సమ్మర్ సెలవులు ముగుస్తాయి. విద్యార్థులంతా  జూన్ 12 న పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఈ  నేపథ్యంలో పాఠశాలకు ఒకరోజు సెలవును పొడిగిస్తు ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.

2 /6

చంద్రబాబు నాయుడు ఏపీముఖ్యమంత్రిగా 12 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి హజరు కావడానికి వెళ్లేందుకు వీలుగాసెలవు పొడిగించమని ప్రభుత్వంను టీచర్ లు కోరారు.

3 /6

టీచర్లు,ఉపాధ్యాయ సంఘాలు కోరిక మేరకు ఏపీ సర్కారు ఒక రోజు పాటు అంటే.. జూన్ 12 కు బదులు, ఏపీలో జూన్ 13 న స్కూల్ లు ఓపెన్ అవుతాయని తెలుస్తోంది.

4 /6

చంద్రబాబు, కూటమిని ఏపీప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. తమకు మంచి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక రాజధాని, ఏపీ స్పెషల్ స్టేటస్, పోలవరం లాంటి సమస్యలను బాబు పరిష్కరిస్తారని ఏపీ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు.

5 /6

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులను ఇచ్చింది. దీంతో ఏపీకి మంచి రోజులు వస్తున్నాయని తెలుస్తోంది. ఏపీకీ రావాల్సిన అన్నిరకాల నిధులను తీసుకొచ్చేలా నేతలు చూస్తున్నారు.

6 /6

చంద్రబాబు వస్తే ఏపీలో జాబ్ లు, మరల పెట్టుబడులు,అన్నిరకాలడెవలప్ మెంట్ అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకు  నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు.