Rashmi Gautam Birthday : యాంకర్ రష్మీ బర్త్ డే.. గ్యాంగ్‌తో కలిసి హల్చల్.. పార్టీ పిక్స్ వైరల్

Rashmi Gautam Birthday యాంకర్ రష్మికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మీ మీద సోషల్ మీడియాలో నెగెటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. రష్మీ నాన్ వెజ్‌ లవర్స్ మీద, పెట్స్ మీద వేసే పోస్టులు ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. తాజాగా రష్మీ తన బర్త్ డే పార్టీకి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

  • Apr 29, 2023, 19:38 PM IST
1 /5

వెండితెరపై ఎంతగా ట్రై చేసినా కూడా రష్మికి బ్రేక్ రాలేదు. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ సినిమాలో సైడ్ పాత్రలో కనిపించింది. కానీ ఆమెను అప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.

2 /5

దాదాపు పదేళ్ల తరువాత అదే అమ్మాయి జబర్దస్త్ అనే షోతో బుల్లితెరపైకి వస్తే మాత్రం ఒక్కసారిగా ఫేమస్ అయింది. యాంకర్‌గా రష్మికి మొదట్లో ఎదురుదెబ్బలే తగిలాయి.

3 /5

తెలుగు రాక రష్మీ మొదట్లో బాగానే ఇబ్బంది పడింది. ఆ తరువాత సుధీర్ రష్మీ ట్రాక్‌ వల్ల నెట్టుకొచ్చేసింది. బుల్లితెరపై సుధీర్ రష్మీ ట్రాక్ ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండింగ్‌గానే ఉంటుంది.

4 /5

రష్మీ ఇప్పుడు తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఏప్రిల్ 27న రష్మీ బర్త్ డే అని చాలా మందికి తెలియదు. ఆమె ఫాలోవర్లు, ఫ్యాన్స్‌కు మాత్రమే తెలుసు.

5 /5

రష్మీ ఎక్కువగా ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో ఉండదు. తన పర్సనల్‌ ఫ్రెండ్స్‌, చిన్ననాటి స్నేహితులతో ఎక్కువగా తిరుగుతుంటుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.