Amy Jackson wedding: ఎవడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమీ జాక్సన్ తాజాగా హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహం ఇటలీలో చాలా ఘనంగా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట.
బ్రిటిష్ - ఇండియన్ యాక్టర్ గా పేరు దక్కించుకున్న అమీ జాక్సన్ తెలుగు, తమిళ్ సినిమాలతో భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మద్రాసపట్టిణం, ఎవడు, ఐ, రోబో 2 వంటి చిత్రాలలో నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈమె హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహం ఇటలీలో చాలా ఘనంగా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అంతేకాదు తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట. దీంతో నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో.. ఈమె రిలేషన్ లో ఉంది. అంతేకాదు కొంతకాలం వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కాకుండానే శారీరకంగా ఒక్కటైన వీరు.. ఆండ్రూ అనే బాబుకి కూడా జన్మించారు. 2020లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు .కానీ కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి కాస్త వాయిదా పడింది. పెళ్లి వాయిదా పడడంతో కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. దీంతో ఇద్దరు విడిపోయారు.
ఆ తర్వాత సౌదీ అరేబియాలో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్లో ఎడ్ ను మొదటిసారి కలుసుకుంది. అమీ జాక్సన్. ఇక అప్పటినుంచి ప్రేమలో విహరిస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఇప్పుడు వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ ఫోటోలు కాస్త బయటకు రావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకరితో శృంగారం, కొడుకు , మరొకరితో పెళ్లి అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా మరొకసారి మళ్లీ వార్తలలో నిలిచింది రామ్ చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్.
ఈమె విషయానికొస్తే తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె, 16వ ఏటనే మోడల్‌గా కెరియర్ ఆరంభించింది. 16 యేటనే మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. 2009లో మిస్ టీన్ వరల్డ్ 2017 మిల్ లివర్ ఫూల్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళ సినీ దర్శకుడు ఏ ఎల్ విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టినం చిత్రంతో కెరియర్ మొదలుపెట్టింది. ఇక ఇప్పుడు వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచింది.