Walking Benefits: ప్రతిరోజూ 3 కిలోమీటర్లు నడిస్తే..అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!!

Walking Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతల ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. ఉదయం లేదంటే సాయంత్రం క్రమం తప్పకుండా నడిస్తే..మీరు అనే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ 3 కిలోమీటర్లు నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దామా? 
 

  • Jul 21, 2024, 19:58 PM IST
1 /7

Benefits of Walking: నేటి బిజీలైఫ్ లో చాలా మంది నడకు గుడ్ బై చెప్పారు. కార్లు, బైకులు, స్కూటీ వేసుకుని ప్రయాణిస్తున్నారు. పక్క గల్లీలో ఉన్న కిరాణాషాపుకు వెళ్లాలన్నా స్కూటీ తీస్తున్నారు. దీంతో శారీరక శ్రమ అనేది చాలా వరకు తగ్గింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. మీరు ఉదయం లేదంటే సాయంత్రం క్రమం తప్పకుండా నడిస్తే..అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వాకింగ్ అనేద శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. నడక అన్ని వయసుల వారికి మంచిది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ మూడు కి.మీ.నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. 

2 /7

నడక బరువు తగ్గించడం నుండి గుండెను ఆరోగ్యంగా ఉంచేంత వరకు అన్నింటికీ సహాయపడుతుంది. రోజువారీ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

3 /7

రోజువారీ నడక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ నడవాలి. క్రమం తప్పకుండా నడిస్తే.. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.   

4 /7

క్రమం తప్పకుండా నడిస్తే..గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి రక్తపోటు, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

5 /7

నడక ఒత్తిడి, ఆందోళన,నిరాశవంటి లక్షణాలను తగ్గిస్తుంది. రిథమ్,కాలు కదలిక నడక ద్వారా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను తెస్తుంది.

6 /7

రోజూ నడుస్తుంటే జీర్ణాశయం పనితీరు పుంజుకుంటుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల ప్రేగు కదలికలు నియంత్రణలో ఉంటాయి. మలబద్ధకం, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను నయం చేయవచ్చు.  

7 /7

మీరు వేగంగా నడిస్తే శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజితమై మంచి ఫలితాలు వస్తాయి. హృదయ స్పందన రేటు, శ్వాసను పెంచడానికి వేగంగా నడవడం మంచిది.కానీ మీ హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండేలా మీరు నడవకూడదు. గంటకు రెండు-మూడు కి.మీ. నడవడం మంచిది. కొంచెం చురుకైన నడక హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.ప్రారంభంలో నెమ్మదిగా ప్రారంభించి, ఆ తర్వాత వేగాన్ని పెంచుకోవాలి.