Boda kakarakaya benefits: వర్షాకాలంలో మాత్రమే బోడకాకర కాయలు లేదా అడవి కాకర కాయలు అరుదుగా లభిస్తుంటాయి. ఇవి ఎంతో టెస్టీగాను, కాస్లీగాను ఉంటాయి. వీటివల్ల పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయి.
చాలా మంది మాములు కాకర కాయలను తినడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ వానకాలంలో దొరికే బోడకాకర కాయల కోసం కొంత మంది ఎదురు చూస్తుంటారు. దీన్ని వివిధ ప్రాంతాలలో అనేక పేర్లతో పిలుస్తుంటారు. కొందరు ఆ కాకర కాయ, అగాకర అని పేర్లతో కూడా పిలుస్తుంటారు.
బోడకాకరకాయలు చాలా అరుదుగా లభిస్తాయి. వీటిలో పుష్కలమైన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇవి మనిషిలోని ఇమ్యునిటీని పెంచుతాయి. అదే విధంగా పోషకాలు, కొవ్వులు, మినరల్స్ లను అందిస్తాయి. ఇవి తింటే జీర్ణవ్యవస్థ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఇవి తినడం వల్ల మనశరీరానికి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. ఇందులో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి అన్ని పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను మెరుగు పరుస్తుంది.
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ బి, విటమిన్ సీ, డీలు, విటమిన్ D2, 3, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, జింక్ ఇలా అన్ని ఈ కూరగాయాలో పుష్కలంగా ఉంటాయి.
చాలా మంది తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడటం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, డయాబెటిక్, రక్తపోటు, ప్రెగ్నెంట్ లేడీస్ కు బోడకాకర ఎంతో ఉపయోగపడుతుంది.
రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించడంలో బోడకాకర ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వర్చే వ్యాధులు, దురదల నుంచి కూడా కాపాడుతుంది. కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. అధిక చెమటను తగ్గిస్తుంది. అదే విధంగా..జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)