Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం.. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా గురించి ఒక బాలీవుడ్ రివ్యూ రైటర్ ఏమన్నారంటే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన పుష్ప: ది రైజ్ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి సీక్వల్ గా వస్తున్నా పుష్ప: ది రూల్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
పైగా పుష్ప సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా అందుకోగా.. పుష్ప 2 మీద క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ చిత్ర ట్రైలర్ ఈ మధ్యనే విడుదల సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలకి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉండగా.. సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ రివ్యూ రైటర్ ఉమైర్ సందు పుష్ప 2 సినిమా ఫస్ట్ రివ్యూ బయటపెట్టేసారు. "షాకింగ్: పుష్ప 2 ఇన్సైడ్ రిపోర్ట్స్ చాలా యావరేజ్. పైకి మెరిసేవి అన్నీ బంగారం కాదు" అంటూ సోషల్ మీడియాలో ఉమైర్ చేసిన ట్వీట్ అందరికీ షాక్ ఇచ్చింది.
కొంతమంది సినిమా నిజంగానే యావరేజ్ గానే ఉండొచ్చు అని కామెంట్స్ చేస్తుంటే.. ఫ్యాన్స్ మాత్రం ఆ బాలీవుడ్ రివ్యూవర్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఉమైర్ సందు ఇప్పటికీ చాలా సినిమాలకి తప్పుడు రివ్యూలు ఇచ్చారు. కాబట్టి అతని రివ్యూలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కొందరు.. కొట్టి పారేస్తున్నారు.
ఇక పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి.. విడుదలకు ముందు ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణమే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.