Akshar Patel Interview: టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సంబరాలు చేసుకున్నారు. ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై ఉత్కంఠభరిత పోరులో గెలుపొందింది. ఓ దశలో క్లాసెన్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ ఓడిపోతుందని భయం ఫ్యాన్స్‌లో మొదలైంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లాసెన్ దంచికొట్టాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ సఫారీ చేతుల్లోకి వెళ్లినట్లు అయింది. కానీ హార్థిక్ పాండ్యా క్లాసెన్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో తన పర్ఫామెన్స్ గురించి తాజాగా అక్షర్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో తాను సరైన సమయంలో ఔట్ అయ్యాయని.. బౌలింగ్‌లో ధారళంగా పరుగులు ఇచ్చానని చెప్పాడు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని అన్నాడు. క్లాసెన్ తన ఓవర్‌లో 24 పరుగులు బాదడంతో ఐదు సెకెండ్స్ ఏం జరిగిందో అర్థం కాలేదన్నాడు.
దీంతో తాను ఎంతో నిరుత్సాహానికి గురయ్యాయని.. మ్యాచ్ ఓడిపోతామని అనుకున్నామన్నాడు. ఓవర్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ తన దగ్గరకు వచ్చి.. బౌలింగ్ బాగా చేశావని మెచ్చుకున్నాడని చెప్పాడు.
ఆందోళన చెందాల్సిన పనిలేదని తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించాడని అక్షర్ గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ చివరి వరకు తాము ఆశలు వదులులోదన్నాడు. ఓటమిని అంగీకరించడానికి సిద్దపడలేదన్నాడు.
తాను బ్యాటింగ్‌లో సరైన సమయంలో ఔట్ అయి పెద్ద తప్పు చేశానని ఈ స్టార్ ఆల్‌రౌండర్ అన్నాడు. ఓ ఎండ్‌లో కోహ్లీ నిలకడగా ఆడాడని.. చివరి మూడు దూకుడుగా ఆడి ఎక్కువగా పరుగులు చేయాలనుకున్నామన్నాడు. అయితే కీలక సమయంలో ఔట్ అవ్వడంతో తనపై తనకే కోపం వచ్చిందన్నాడు.