Ajith and Salini Love Story: తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అజిత్. తెలుగులో సైతం ఈ హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంది. మరోపక్క సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శాలిని నీ.. ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరికీ ఒక కూతురు ఉండగా.. ఆ అమ్మాయి ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరొందిన అజిత్. ఇక అజిత్ పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శాలినినీ. చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరిలో శాలిని చిన్న పాత్రలో కనిపించింది.
ఆ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న శాలిని.. ఆ తరువాత.. సఖి సినిమాతో హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇప్పుడు వీరిద్దరి కూతురు అనౌష్క సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
అజిత్ తన నటనతో ఎంతో పేరు తెచ్చుకోగా.. ఇప్పుడు తన కూతురు కూడా తన అందం, అలానే తన సోషల్ మీడియా ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం విదేశాలలో చదువుతున్న అనౌష్క, త్వరలోనే కోలీవుడ్ పరిశ్రమలో ప్రవేశించబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోపక్క విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఆమె ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని. అనుకుంటున్నట్లు సమాచారం. అజిత్ తన కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ డమ్ సాధించాడు.
అజిత్ తెలుగు ప్రేక్షకులలో కూడా.. మంచి పేరు తెచ్చుకున్నారు. అజిత్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి స్పందనను పొందుతున్నాయి. ప్రస్తుతం అజిత్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు - "మీజ్ తిరుమేని", "గుడ్ బ్యాడ్ అగ్లీ".
ఈ క్రమంలో అజిత్ కూతురు కూడా త్వరలోనే సినిమాలకు రానుందని రూమర్స్ వినిపిచ్చాయి. అలాగే, అనౌష్క తన లుక్‌తో స్టార్ హీరోయిన్స్‌ను మించినట్లు ఉందని.. ఆమె ఫోటోలు చూసినవారు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.