Sreeleela Pics: పచ్చటి పొలాల నడుమ శ్రీలీల హోయాలు.. స్టిల్స్ మాములుగా లేవు

Sreeleela Upcoming Movies: ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో యాక్ట్ చేసింది రెండు సినిమాలే అయినా. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ధమాకా మూవీ ఇచ్చిన బంపర్ హిట్‌తో తెలుగులో టాప్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు.  
 

1 /5

కిస్ అనే కన్నడ మూవీతో తెరంగేట్రం చేసింది శ్రీలీల. తెలుగులో సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD మూవీతో ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడకున్నా.. ఇందులో శ్రీలల అందానికి, డ్యాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.  

3 /5

దీంతో రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ దక్కింది. ఈ సినిమా శ్రీలీల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.  

4 /5

ఇందులో రవితేజతో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంటర్‌నెట్‌ను ఊపేస్తున్నాయి. శ్రీలీల క్రేజ్‌తో ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరింది.  

5 /5

ప్రస్తుతం శ్రీలీల డేట్లు మరో రెండేళ్ల వరకు లాక్ అయ్యాయి. మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్‌ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతోపాటు ఓ కన్నడ సినిమాలోనూ నటిస్తోంది. మూడు షిఫ్ట్‌లలో షూటింగ్స్‌తో బిజీగా ఉంది ఈ తెలుగు అమ్మాయి.