అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!

  • Feb 29, 2020, 12:31 PM IST

బుల్లితెరపై సందడి చేసిన శ్వేతా తివారి అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ తలుపుతట్టింది. ఇటీవల జరిగిన తన సోదరుడు నిధాన్ వివాహ వేడుకలో నటి శ్వేతా తివారి తళుక్కున మెరిశారు. కూతురు పాలక్ తివారితో ఆమె దిగిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. 

1 /13

చిన్న వయసులోనే శ్వేతా తివారి వివాహం, ఆపై విడాకులు ఆమె జీవితాన్ని కాస్త మలుపుతిప్పాయి. తాజాగా సోదరుడు నిధాన్ పెళ్లి వేడుకలో సందడి చేస్తూ ఈ వయసులోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

2 /13

అందంలో కూతురు పాలక్ తివారికి పోటీ ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో మహామహులను ఎదుర్కొని విజేతగా నిలిచారు శ్వేతా తివారి.

3 /13

18ఏళ్ల ప్రాయంలో 1998లో రాజా చౌదరిని శ్వేతా తివారి వివాహం చేసుకున్నారు. వీరి సంతానంగా ఓ కూతురు పాలక్ తివారి ఉంది. అయితే భర్త వేధిస్తున్నాడని, తాగొచ్చి కొడుతున్నాడని ఆరోపిస్తూ విడాకులు తీసుకున్నారు. దీంతో 2007లో వీరి వైవాహిక జీవితానికి తెరపడింది.

4 /13

అనంతరం 2013లో అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం ఓ మూడేళ్ల బాబు రెయాన్ష్ ఉన్నాడు. ఆరేళ్లపాటు సాఫీగా సాగిన రెండో వైవాహిక జీవితం 2019లో ముగిసింది. 

5 /13

కోహ్లీ తనని వేధిస్తున్నాడని, తన మొదటి భర్తతో కలిగిన కూతురు పాలక్ తివారిని, తనను కొట్టాడని ఆరోపిస్తూ విడాకులు తీసుకున్నారు. బిగ్ బాస్ లాంటి ప్రసిద్ధి రియాలిటీ షోలో విజేతగా నిలిచిన తర్వాత జీవితంపై మరోసారి ఆశ కలిగి అభినవ్ కోహ్లీని వివాహం చేసుకున్నా.. అది కూడా సజావుగా సాగలేదు.

6 /13

ప్రస్తుతం సింగిల్ మదర్‌గా ఉంటూ పిల్లల బాధ్యతల్ని చూసుకుంటూ సినిమాలు, టీవీ షోలతో బిజిబిజీగా గడుపుతున్నారు శ్వేతా తివారి. (Image Courtesy: Instagram/Shweta Tiwari)

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13

ఈ ఫొటోలను శ్వేతా తివారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. (All Images Courtesy: Instagram/Shweta Tiwari)