Pooja Hegde: రోజా పువ్వు రెక్కల డ్రెస్సులో..రోజాలా మెరిసిపోయిన పూజా హెగ్డే..

Pooja Hegde Latest Photos: పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందమైన ఫోటోలతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

1 /5

నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ముకుందా సినిమాలో సైతం కనిపించింది. మొదటి రెండు చిత్రాలలో కూడా ఎంతో పద్ధతిగా కనిపించి ట్రెడిషనల్ హీరోయిన్ గా మెప్పించండి.

2 /5

అయితే సడన్ గా రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేలు రాణి ఐటెం సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కాగా అదృష్టం కొద్దీ ఈ హీరోయిన్ కి ఈ ఐటెం సాంగ్ చేసిన తర్వాత నుంచి అవకాశాలు మరిన్ని ఎక్కువయ్యాయి.

3 /5

ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే చేసిన అరవింద సమేత, అలా వైకుంఠపురం లో చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా ఇక పూజ హెగ్డేకి ఎదురు లేదు అనుకున్న దగ్గర నుంచి సమస్యలు అన్ని మొదలయ్యాయి.

4 /5

గత రెండు సంవత్సరాల నుంచి ఈ హీరోయిన్ చేసిన చిత్రాలు అన్ని అపజయం పాలవుతూవస్తున్నాయి. ఈ క్రమంలో ఈ హీరోయిన్ త్వరలోనే సిద్దు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ లో హీరోయిన్ గా చేయనుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

5 /5

కాగా ఈ సినిమాల విషయం పక్కనపెడితే.. పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అభిమానులను తరచూ అలరిస్తూఉంటుంది. ముఖ్యంగా పూజా హెగ్డే రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.