Aadi Amavasya 2024 In Telugu: హిందూ పురాణాల ప్రకారం, అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది ఈ అమావాస్య రోజున పతృదేవతలను పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఇలాంటి రోజు వారిని పూజించడం వల్ల జీవితంలో వస్తున్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా పితృదేవతల మోక్షం కూడా లభిస్తుంది.
ఈ సంవత్సరం ఆగస్టు నెలలోని ఎంతో ప్రత్యేకత కలిగిన ఆది అమావాస్య కూడా రాబోతోంది. ఈ నెలలోని నాలుగవ రోజు ఈ అమావాస్య రాబోతోంది. అయితే హిందూ పురాణాల ప్రకారం దీనికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది.
ఆది అమావాస్య రోజున సూర్య గ్రహ కదలికల కారణంగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా విష్ణువు యోగ నిద్రలోకి కూడా వెళ్తాడు. దీంతో ఈ సమయంలో చాలా మంది అమ్మవార్లను పూజిస్తారు.
ఆది మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక, కెరీర్‌కి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ సమయంలో శివారాధనకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. ఉత్తర భారత్‌లో జీవించే చాలా మంది హిందువులు ఈ సమయంలో నది స్నానాలు చేసి శివుడిని పూజిస్తారు.
అలాగే ఈ సమయంలో చాలా మంది నది స్నానాలు చేసి, పూర్వీకులకు ప్రత్యేకమైన పూజలు చేసి పిండ ప్రధానం చేస్తారు. అంతేకాకుండా గంగా పూజ కూడా చేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఎవరైనా చనిపోయిన వారికి ఈ ఆది అమవాస్య రోజున ప్రత్యేకమైన తిథిని నిర్వహించడం వల్ల ఆత్మలు కూడా శాంతిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వారి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఆది అమావాస్య రోజున మరిణించిన పెద్దలకు నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. ఇలా సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని హిందువు నమ్మకం.
పితృదేవతల అనుగ్రహం పొందడానికి చాలా మంది ఈ ఆది అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి.