7th pay commission DA Hike 2024: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. డీఏపై ప్రకటన

Telangana Govt Employees DA Hike Updates: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే డీఏ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగులందరూ డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి త్వరలో శుభవార్త వింటారని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

1 /6

శాసనమండలిలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మనకోసం.. ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తోందని మెచ్చుకున్నారు.  

2 /6

ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేయాల్సిందేనని ఆయన అన్నారు. అయితే ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.  

3 /6

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధనిక రాష్ర్టంగా ఉన్నా.. డీఏ ఇవ్వడానికి రెండు నుంచి ఏడేళ్ల పాటు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అంత సమయం తీసుకోకుండా ఆ డీఏలు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  

4 /6

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని భావిస్తున్నారు.  

5 /6

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 50 శాతం డీఏను పొందుతున్నారు. మరోసారి 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరనుంది.   

6 /6

కేంద్ర బడ్జెట్‌లో కొత్త పే కమిషన్‌పై ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించగా.. నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.