7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!

7th Pay Commission Latest News: బడ్టెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని అందరూ భావించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇక రెండో రెండో పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా డీఏ 4 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఏ 4 శాతం పెరిగితే జీతం ఎంత పెరుగుతుంది..? ఉద్యోగులు ఎంత అందుకుంటారు..? లెక్కలు ఇవిగో..
 

1 /8

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతోంది. మొదటి డీఏ జనవరిలో, రెండో డీఏ జూలైలో ఉంటుంది. ఈ ఏడాది జనవరి డీఏ 4 శాతం పెరగడంతో మొత్తం 50 శాతానికి చేరింది.  

2 /8

జూలై డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉంటుందని అంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

3 /8

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న AICPI డేటా ప్రకారం.. డియర్‌నెస్‌ అలవెన్స్ 4 శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే జూన్ ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఇంకా రిలీజ్ కాలేదు.   

4 /8

డీఏ 4 శాతం పెంచితే.. 7వ వేతన సంఘం ప్రకారం.. రూ.18 వేలు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.720, ఏడాదికి రూ.8,640 పెంపు ఉంటుంది. రూ.20 వేల బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.800, ఏడాదికి రూ.9,600 పెంపు ఉంటుంది. అదేవిధంగా రూ.25 వేల బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.1,000, ఏడాదికి రూ.12,000 పెంపుదల ఉండే అవకాశం ఉంది.  

5 /8

బేసిక్ శాలరీ రూ.30 వేలు ఉంటే.. నెలకు రూ.1,200, ఏడాదికి రూ.14,400, బేసిక్ పే రూ.40 వేలు ఉంటే.. నెలవారీ ఇంక్రిమెంట్ రూ.1,600, ఏడాది ఇంక్రిమెంట్-రూ.19,200, బేసిక్ రూ.50 వేలు ఉంటే నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేలు, నెలవారీ జీతం రూ.60 వేలు ఉంటే నెలకు రూ.2,400, వార్షిక ఇంక్రిమెంట్-రూ.28 వేలు ఉండనుంది.  

6 /8

బేసిక్ పే రూ.70 వేలు ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.2,800, ఏడాదికి రూ.33,600, రూ.80 వేలు ఉంటే నెలవారీ ఇంక్రిమెంట్ రూ.3,200, ఏడాదికి రూ.38,400, రూ.90 వేలు ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.3,600, ఏడాదికి రూ.43,200, రూ.లక్ష ఉంటే.. నెలవారీ ఇంక్రిమెంట్ రూ.4 వేలు, వార్షిక ఇంక్రిమెంట్ రూ.48 వేలు ఉంటుంది.   

7 /8

బడ్జెట్‌లో కేంద్రం నిరాశ పరిచినా.. డీఏ పెంపు రూపంలో గుడ్‌న్యూస్ వస్తుందని భావిస్తున్నారు. డీఏ పెంపు అమలు జూలై 1వ తేదీ నుంచి ఉంటుంది.  

8 /8

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.