Weekly Diet Plan: 7 రోజుల డైట్‌ ప్రణాళిక ఇదే.. 5 కిలోలు ఇట్టే బరువు తగ్గుతారు

7 Days South Indian Diet Plan For Weight Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్‌ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.

1 /8

Weekly Diet Plan For Wieght Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్‌ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.

2 /8

మొదటి రోజు అల్పాహారం: కొంచెం చట్నీతో 2-4 సాంబార్‌ ఇడ్లీలను తినండి. మధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్‌తో పాటు అన్ని కూరగాయలతో కలిపిన కూరను వేసుకుని తినండి. క్యారెట్‌లు, బీన్స్, బఠానీలు తప్పనిసరిగా ఉండాలి. చిరుతిండి: వేయించిన వేరుశెనగలు తినండి. రాత్రి భోజనం: పుదీనా చట్నీతో దోస తినండి.

3 /8

2వ రోజు అల్పాహారం: కొబ్బరి చట్నీతో కూరగాయల ఉప్మా తీసుకోండి.  మధ్యాహ్న భోజనం: కూరగాయలతో కూడిన క్వినోవా పులావ్‌ను తినండి. చిరుతిండి: ఫ్రూట్ సలాడ్ తీసుకుండి. వాటిలో నీరు అధికంగా ఉండే పుచ్చకాయ లాంటివి తీసుకోండి. రాత్రి భోజనం: రైతాతో వెజిటబుల్ బిర్యానీ తినండి.

4 /8

3వ రోజు అల్పాహారం: కూరగాయలతో అటుకుల ఉప్మా (పోహా) తినండి. మధ్యాహ్న భోజనం: బచ్చలికూర పప్పు, మామిడికాయ పచ్చడితో కొంచెం బ్రౌన్ రైస్ తినండి.  అల్పాహారం: గ్రీన్ టీ సేవించండి. రాత్రి భోజనం: కొబ్బరి చట్నీతో పాటు 2 మిల్లెట్ దోసెలను తినండి.

5 /8

4వ రోజు అల్పాహారం: టమాటో చట్నీ, కొంచెం మజ్జిగతో 2 రాగి దోసెలు తినండి.  మధ్యాహ్న భోజనం: క్వినోవాను ఉడకబెట్టి కూరగాయలతో కూడిన కూరను వేసుకుని వేడిగా తినండి.  చిరుతిండి: ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మరసం కలిపిన మొలకెత్తిన గింజలను తినండి. రాత్రి భోజనం: 2 చపాతీలు వంకాయ కూరతో తినండి. జీలకర్ర నీటితో తాగండి.

6 /8

5వ రోజు అల్పాహారం: రోటీన్-రిచ్ అడై దోసను పుదీనా లేదా పెరుగు చట్నీతో తినండి. మధ్యాహ్న భోజనం: ఆలూ-గోబీ కూరతో బ్రౌన్ రైస్, ఒక కప్పు టొమాటో చారుతో తినండి.  చిరుతిండి: ఉప్పు, మిరియాలు వేసి ఉడికించిన మొక్కజొన్నను ఒక చిన్న కప్పు తినండి. రాత్రి భోజనం: టమాట రైస్ లేదంటే ఆలు గడ్డ కూరతో కొంచెం అన్నం తినండి.

7 /8

6వ రోజు అల్పాహారం: కూరగాయలు, వేరుశెనగలు జోడించి కొన్ని రుచికరమైన వెర్మిసెల్లిని చేసుకుని తినండి. మరింత కారం కావాలంటే వేరుశెనగ-మిరపకాయ చట్నీతో తినండి.  మధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్‌తో పాటు కూరగాయలతో కూడిన సాంబార్ తీసుకోండి. తెల్ల అన్నంతో అయినా తినవచ్చు.  రాత్రి భోజనం: మల్టీగ్రెయిన్ పిండి చపాతీలు, గుమ్మడికాయ కూరతో తినండి. ఒక కప్పు గ్రీన్ టీతో రోజును ముగించండి.

8 /8

7వ రోజు: అల్పాహారం: రవ్వ ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, టమాటా కూర మధ్యాహ్న భోజనం: టమాటా కూరతో పాటు కొన్ని వడలను వేయించడానికి ప్రయత్నించండి. సగం గిన్నె పెరుగులో కొన్ని దాల్చిన చెక్, కరిగించిన డార్క్ చాక్లెట్‌ని కలిపి సేవించండి. రాత్రి భోజనం: టమాట-ఉల్లిపాయ చట్నీతో కొన్ని మిల్లెట్ పొంగల్ తయారు చేసుకుని తినండి.