Bhadrapada Amavasya 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చి భాద్రపద అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఈ అమావాస్య సెప్టెంబర్ రెండవ తేదీన వచ్చింది. పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పిండ ప్రధానం, ఇతర కార్యక్రమాలు చేసే వారట. ఇలా చేయడం వల్ల పితృ దోషాల నుంచి విముక్తి లభించి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని హిందువుల నమ్మకం.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ అమావాస్య రోజున శుక్ర గ్రహం నక్షత్ర సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
ముఖ్యంగా శుక్రుడు సంచారం చేయడం కారణంగా సింహ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారికి డబ్బు, ఆదాయ సంబంధిత విషయాల్లో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాగే సింహ రాశి వారికి కొత్త ఆస్తిపాస్తులు లభిస్తాయి అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాల్లో పెట్టాలనుకున్న పెట్టుబడులు కూడా పెట్టి లాభాలు పొందుతారు.
భాద్రపద అమావాస్య రోజున శుక్రుడు సంచారం చేయడం కారణంగా కన్యా రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయాలు సాధించడమే కాకుండా భారీ మొత్తంలో డబ్బులు పొందుతారు.
కన్యా రాశి వారికి ఈ అమావాస్య నుంచి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకోని విజయాలు కూడా కలుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి అంతా బాగుంటుంది.
మకర రాశి వారికి కూడా శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
మకర రాశి వారు ఈ సమయంలో తమ వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశాలున్నాయి దీనికి కారణంగా వారు ఎంతో బిజీ బిజీ గా కూడా మారచ్చు. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతోపాటు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి.