ఎన్నారైలకు.. ఈ స్కీములు వర్తించవు

  

Last Updated : Nov 3, 2017, 05:28 PM IST
ఎన్నారైలకు.. ఈ స్కీములు వర్తించవు

మీరు భారతదేశంలో పోస్టు ఆఫీసు సేవింగ్స్ స్కీములైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లాంటివాటిలో పెట్టుబడి పెట్టారా..? అయితే ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకుంటే ఈ స్కీములపై మీకు ఎలాంటి వడ్డీ లభించదు. ఎప్పుడైతే మీరు మీ స్టేటస్‌ని ఎన్నారైగా మార్చుకుంటారో, ఆ రోజుతో ఈ స్కీముల ద్వారా మీకు వచ్చే వడ్డీ కూడా ఆగిపోతుంది. అలాగే మెచ్యురిటీకి ముందే ఖాతా కూడా క్లోజ్ అవుతుంది.  పీపీఎఫ్ స్కీము 1968 అమెండ్‌మెంట్ ప్రకారం " ఏ రోజుతో భారతీయ పౌరుడు ఎన్నారైగా మారతాడో, ఆ రోజుతో భారతదేశంలో అతని పేరు మీద ఉన్న పీపీఎఫ్ స్కీముకు సంబంధించిన అకౌంట్ మెచ్యురిటీకి క్లోజ్ అయిపోతుంది. స్కీముదారుడు తన డబ్బును ఎప్పుడైనా తీసుకెళ్లవచ్చు. అయితే మెచ్యురిటీ తర్వాత వచ్చే వడ్డీ మాత్రం లభించదు. అకౌంట్ క్లోజ్ అయిన తేదీ వరకు మాత్రమే వడ్డీ జమవుతుంది" అని పేర్కొనబడింది. మన దేశ చట్టాల ప్రకారం, ఎన్నారైలు భారతదేశంలో పోస్టాఫీసు పరిధిలోకి వచ్చే ఏ డిపాజిట్ స్కీముల్లో కూడా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. ఇటీవలే ప్రభుత్వం పీపీఎఫ్ మీద ఇచ్చే వడ్డీ రేటును 7.8 శాతానికి పెంచడంతో మళ్లీ ఈ చట్టం వెలుగులోకి వచ్చింది. 

Trending News