మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం.

Last Updated : Dec 14, 2017, 08:23 PM IST
మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్ ఎన్నారై సొంతం

చెన్నైలోని మద్రాస్ స్టాక్ ఎక్సేంజీ బిల్డింగ్‌ను ఇటీవలే అమ్మకానికి పెట్టారు. జార్జిటౌన్ ప్రాంతంలోని పూర్తిస్థాయి కమర్షియల్ ఏరియాయైన సెకండ్ లైన్ బీచ్ ప్రాంతంలో ఉన్న 41,000 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఆ పాత కట్టడాన్ని ఓ ఎన్నారై కొంటున్నారని సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న ఆ ఎన్నారై దాదాపు 16.50 కోట్లకు ఆ బిల్డింగ్‌ను సొంతం చేసుకోనున్నారని తెలుస్తోంది.

2015లో ఎంఎస్‌ఈ, సెబీ నియమాలకు అనుగుణంగా ట్రేడింగ్ జరపడంలో విఫలమైనందున సంస్థ ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు లైసెన్స్ కూడా ఆ సంస్థ కోల్పోయింది. కొన్నాళ్ల తర్వాత ఎంఎస్‌‌ఈ పేరును మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చారు ఆ సంస్థ నిర్వాహకులు. ఈ క్రమంలో గత కొంతకాలం క్రిందట ఎంఎస్‌ఈ బిల్డింగ్ కూడా అమ్మకానికి పెట్టారు. 

దాదాపు 80 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఒకప్పుడు దాదాపు 32 కోట్ల రూపాయలు పలికిన ఆ బిల్డింగ్ ధర, అమాంతం పడిపోవడం వెనుక కూడా బలమైన కారణం ఏదైనా ఉందేమోనని అంటున్నారు పలువురు ఆర్థిక నిపుణులు. సంస్థకు సంబంధించి ఏవైనా అంతర్గత విభేదాలు ఉన్నాయా అన్న విషయంపై కూడా అనుమానాలు ఉన్నాయి. 

ఈ మధ్యకాలంలో ఆ బిల్డింగ్‌ను అమ్మకానికి పెడుతున్నామని యాజమాన్యం ప్రకటించాక, ఆ సంస్థలో అనుబంధం ఉన్న ప్రముఖ ఖాతాదారులు మరియు అధికారిక సభ్యులకు ఒక ఆహ్వానం కూడా పంపారట. త్వరలో బిల్డింగ్ అమ్మకానికి పెడుతున్న క్రమంలో ఒక చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేస్తున్నామని..  సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తులందరూ వచ్చి, ఆ బిల్డింగ్‌తో తమకున్న తీపి గుర్తులను నెమరువేసుకోవాలని ఆ ఆహ్వానంలో పేర్కొన్నారట.  

Trending News