Mumbai Indians vs Chennai Super Kings Dream 11 Team Prediction for IPL 2023 Match 12: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు ఏవి అంటే వెంటనే గుర్తొచ్చేవి.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK IPL 2023). ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే.. అభిమానుల్లో ఏంతో ఉత్సాహం ఉంటుంది. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య నేడు బిగ్ ఫైట్ జరగనుంది. శనివారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటినుంచే మైదానంకు చేరుకుంటున్నారు.
ఐపీఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. సొంత మైదానంలో మాత్రం చెలరేగింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ఇక ముంబైపై చెలరేగేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ ఎంఎస్ ధోనీ తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకారం అందించని నేపథ్యంలో మిచెల్ శాంట్నర్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ సిసాండ మగాల ఆడే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాదిరే ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ 2023ని ఓటమితో ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో పరాజయం పాలైంది. దాంతో సొంత మైదానంలో సీఎస్‌కేను ఓడించాలని చూస్తోంది. ముంబై స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ ఆర్చర్ ఆడకపోతే బౌలింగ్ భారం మొత్తం జేసన్ బెహ్రండాఫ్ మీదే పడుతుంది.
తుది జట్లు (అంచనా) (MI vs CSK Playing 11):
చెన్నై: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయీన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సిసాండ మగాల, దీపక్ చహర్, రాజ్‌వర్ధన్ హంగ్రేకర్.
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, హృతిక్ షోకీన్, మహమ్మద్ అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెండాఫ్.
డ్రీమ్ 11 టీమ్ (MI vs CSK Dream11 Team):
డెవాన్ కాన్వే (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, కామెరాన్ గ్రీన్, దీపక్ చహర్, జోఫ్రా ఆర్చర్, రాజ్వర్ధన్ హంగర్గేకర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.