Difference Between White Salt & Rock Salt: ప్రస్తుతం చాలా మంది తెల్ల ఉప్పుతో పాటు రాక్ సాల్ట్‌ను కూడా వినియోగిస్తున్నారు. ఆహార పదార్థాలను బట్టి ఉప్పులను వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం బ్లాక్ సాల్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఉప్పును వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే తెల్ల ఉప్పు వల్ల శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయా?, రాక్ సాల్ట్ వల్ల కలుగుతాయా అనే ప్రశ్నలు మీకు రావొచ్చు. అయితే ఈ ప్రశ్నలకు మీకు మేము ఈ రోజు సమాధానం తెలపబోతున్నాం.
ఒక రోజులో ఎంత ఉప్పు తినాలి?:
ప్రస్తుతం చాలా మంది విచ్చలవిడిగా ఉప్పును వినియోగిస్తున్నారు. అయితే ఇలా వినియోగించడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి వ్యక్తి రోజుకు 10.8 గ్రాములు వినియోగిస్తారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం..ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే తక్కువగా తినాలని పేర్కొంది. ఇలా తినడం వల్ల ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఉప్పును అతిగా తినకపోవడం చాలా మంచిది.
రాక్ సాల్ట్, వైట్ సాల్ట్ మధ్య వ్యత్యాసాలు:
Also Read: White Hair To Black Hair: ఈ పువ్వుతో తెల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా, 5 రోజుల్లో జుట్టు రాలడానికి చెక్!
రాక్ సాల్ట్:
రాళ్ల ఉప్పు, తెల్ల ఉప్పు రుచిలో తేడా ఉండకపోయి. మానవ ఆరోగ్యం విషయంలో చాలా రకాల తేడాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రెండు లవణాల మధ్య రంగులో తేడా ఉండటమే కాకుండా, రెండూ ఆరోగ్యంపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాక్ ఉప్పు సముద్రం లేదా ఉప్పు నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. అంతేకాకుండా ఇందులో సోడియం క్లోరైడ్ వల్ల రంగురంగుల స్ఫటికాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ఉప్పు స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే దాని తయారీలో ఎటువంటి అవకతవకలు జరగవు కాబట్టి ఇది శరీరానికి చాలా మంచిది.
సాదా ఉప్పు:
సాదా ఉప్పును తయారు చేయడానికి ఉప్పును శుద్ధి చేస్తారు. ఇందులో 95 శాతానికి పైగా ఉప్పు ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల రసాయానాలు మిళితమవుతాయి. ఈ ఉప్పులో అయోడిన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పును అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని వల్ల కొందరిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి దీనిని అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Diet: బరువు తగ్గడానికి రోటీ బెటరా, రైస్ బెటరా? ఎలా వెయిట్ లాస్ అవుతారో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
White Salt Vs Rock Salt: ఆరోగ్యానికి ఏ సాల్ట్ బెస్ట్..? రాక్ సాల్ట్ లేదా వైట్ సాల్ట్..?