Post Office Recurring Deposit Scheme: పొదుపు చేయాలనే ఆలోచన మీకు ఉంటే.. పెద్ద మొత్తంలోనే చేయాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంలో పొదుపు చేసినా.. తక్కువ కాలంలోనే ఎక్కువ రాబడిని పొందవచ్చు. ఇందుకోసం అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.100 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా గణనీయమైన ఫండ్‌ను పొందవచ్చు. ఈ పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పోస్టాఫీసు ఆర్డీ ఏడాదికి 5.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీలో మార్పు త్రైమాసిక ప్రాతిపదికన ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (పీఓఆర్‌డీ) ఐదు సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి పొడిగించవచ్చు. అంటే మీరు మీ ఖాతాను 10 సంవత్సరాల పాటు అమలు చేయవచ్చు. పీఓఆర్డీలో నెలవారీ రూ.10 వేల డిపాజిట్‌తో.. రాబోయే 10 సంవత్సరాలలో భారీ గ్యారెంటీ కార్పస్‌ను సేవ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులో డిపాజిట్లపై ఎలాంటి రిస్క్ ఉండదు. మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ పథకం కింద ఎన్ని ఖాతాలనైనా ఓపెన్ చేసుకోవచ్చు.
ఆర్డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. ఈ ఆర్డీ ఐదేళ్లు అంటే 60 నెలల పాటు అమలు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ముందుగా ఆర్డీని క్లోజ్ చేయాలనుకుంటే.. మూడేళ్ల తర్వాత మూసివేయవచ్చు. పోస్టాఫీసు ఆర్డీలో ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. ఇందులో, సింగిల్ కాకుండా, 3 మంది వరకు ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. మైనర్ కోసం గార్డియన్ ఖాతాను తెరవవచ్చు.
పోస్టాఫీస్ ఆర్డీ లెక్కల ప్రకారం.. మీరు నెలవారీ పథకంలో ప్రతి నెలా 10 వేలు డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల తరువాత మీకు రూ.6,96,968 గ్యారెంటీ ఫండ్ ఉంటుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.96,968. దీనిని మీరు మరో ఐదేళ్లు పొడగిస్తే.. మీకు రూ.16,26,476 గ్యారెంటీ ఫండ్ ఉంటుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. కాగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.4,26,476.
పోస్టాఫీసు ఆర్డీ పథకంలో కూడా రుణ సౌకర్యం కూడా ఉంటుంది. 12 వాయిదాలు జమ చేసిన తర్వాత ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. రుణాన్ని ఏకమొత్తంలో లేదా వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. ఆర్డీపై వడ్డీ కంటే లోన్ వడ్డీ రేటు 2 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో నామినేషన్ వెసులుబాటు కూడా ఉంది.
Also Read: IRCTC: ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి
Also Read: Kisan Vikas Patra: రైతులకు వరం కిసాన్ వికాస్ పత్ర.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook