Okaya Faast F3 EV Scooter: ఇండియాలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ బ్రాండ్ అయిన ఒకాయ తమ ఫాస్ట్ సిరీస్ వాహనాల శ్రేణికి మరో అద్భుతాన్ని జోడించింది. ఫాస్ట్ F3 పేరిట వాటర్‌ప్రూఫ్, డస్ట్ రెసిస్టంట్ బ్యాటరీ టెక్నాలజీతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 70 కిమీ కాగా సింగిల్ చార్జింగ్‌తో 125 కిమీ వరకు దూసుకుపోయే బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ ఫాస్ట్ సిరీస్‌ని మరింత ధృడపర్చనుంది.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా..
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకాయా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. 1200W మోటార్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 2500W పవర్‌ని అందించేలా 3.53 kWh Li-ion LFP డ్యూయల్ బ్యాటరీస్‌తో రూపొందించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. బ్యాటరీ లైఫ్ పెరిగేలా స్విచబుల్ టెక్నాలజీని ఉపయోగించారు. 4-5 గంటల వ్యవధిలో బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. స్కూటర్ మోటార్, బ్యాటరీపై ఒకాయా 3 ఏళ్ల వారంటి అందిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేసి వాటి వినియోగం పెరిగేలా చేయడమే లక్ష్యంగా తక్కువ ధరలో రూ.99.999 కే ఒకాయా ఈ ఫాస్ట్ F3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. అత్యుత్తమ పర్‌ఫార్మెన్స్‌కి తోడు రిజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్స్, వెనుక భాగంలో వాహనం కుదుపులకు గురికాకుండా హైడ్రాలిక్ స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్స్ వంటి బెస్ట్ ఫీచర్స్ మరెన్నో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం.
ఫాస్ట్ F3 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ సందర్భంగా ఒకాయా ఎలక్ట్రిక్ వెహికిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ.. " దేశంలో నాణ్యత కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తోడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫాస్ట్ F3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేయడం జరిగింది అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారిని ఆకర్షించేలా, సౌకర్యవంతంగా అన్నిరకాల బెస్ట్ ఫీచర్స్, అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ స్కూటర్స్‌ని తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఒకాయా నెంబర్ 1 గా నిలిచేలా ఫాస్ట్ F3 వినియోగదారులను ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకు ఉంది " అని ధీమా వ్యక్తంచేశారు.
వినియోగదారులను ఆకట్టుకునేలా మెటలిక్ బ్లాక్, మెటలిక్ క్యాన్, మ్యాట్ గ్రీన్, మెటలిక్ గ్రే, మెటలిక్ సిల్వర్, మెటలిక్ వైట్ వంటి ఆరు రంగుల్లో ఫాస్ట్ F3 ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది.
Okaya Faast F3 లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే..
నమ్మకమైన నాణ్యత అందించే దృఢమైన బ్యాటరీ : అత్యుత్తమ నాణ్యత కలిగిన లిథియం అయాన్ ఎల్ఎఫ్‌పి బ్యాటరీ, పవర్‌ఫుల్ మోటార్, వాటర్‌ప్రూఫ్, డస్ట్ రెసిస్టంట్ టెక్నాలజీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. అధిక ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం కలిగి ఉండేలా ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ని రూపొందించారు. బ్యాటరీకి 3 ఏళ్లు లేదా గరిష్టంగా 30 వేల కిమీ వారంటీ కూడా అందిస్తుండటం మరో విశేషం.
ప్రయాణంలో సుదీర్ఘమైన రేంజ్‌తో పాటు దీర్ఘకాలం మన్నిక: నేటితరం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ లైఫ్ పెరిగేలా స్విచబుల్ టెక్నాలజీని ఉపయోగించి 3.53 kWh డ్యూయల్ బ్యాటరీస్, 2500W మోటార్ పవర్ ఉత్పత్తయ్యేలా ఈ స్కూటర్‌ని రూపొందించారు. కేవలం 4-5 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవడంతో పాటు గంటకు 70 కిమీ గరిష్ట వేగంతో సింగిల్ చార్జింగ్ తో 125 కిమీ రేంజ్ సైతం అందిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఈకో, సిటీ, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ ఉపయోగించి వాహనాన్ని డ్రైవ్ చేయవచ్చు.
అత్యుత్తమ పనితీరుతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం: ట్రాఫిక్ జామ్ సమస్యలతో సతమతమయ్యే నగరవాసులు తమ అవసరాలకు రాజీపడకుండా ఉండేలా ఈ స్కూటర్‌ని రూపొందించారు. గంటకు 70 కిమీ వేగంతో వెళ్లడం మాత్రమే కాదు.. సురక్షితమైన ప్రయాణం కోసం 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను కూడా అమర్చారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ వంటి అత్యుత్తమ పరిజ్ఞానం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి మరో అధనపు ఆకర్షణగా నిలిచాయి.
చోరీల బారిన పడకుండా యాంటీ-థెప్ట్ ఫీచర్: సేఫ్ బ్యాటరీ, హైపవర్ మోటార్‌కి తోడు వీల్ లాకింగ్ ఫీచర్ కూడా నిజంగా ఫాస్ట్ F3 ని మరో స్థాయికి తీసుకెళ్లే వాహనం చేసింది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. స్కూటర్ లాక్ చేసిన సమయంలో దీనిని ఎవరైనా ముందుకు తోయడానికి ప్రయత్నిస్తే.. వెంటనే ఆటోమేటిగ్గా వీల్ లాక్ అయిపోతుంది. ఫలితంగా ఈ వాహనాన్ని ఎవరైనా దొంగిలించాలని ప్రయత్నించినా.. అది అసలే సాధ్యపడదు. క్షణాల వ్యవధిలోనే ద్విచక్ర వాహనాలు మాయం అవుతున్న ఈ రోజుల్లో ఈ వీల్ లాక్ ఫీచర్ నిజంగా మరో ప్లస్ పాయింట్ కానుంది.
ఇది కూడా చదవండి : Renault Kwid Prices: మరింత అందుబాటులోకి రెనో క్విడ్ RXE వేరియంట్ కారు ధర
ఇది కూడా చదవండి : Why Cars Catches Fire: కార్లలో మంటలు ఎందుకు వస్తాయో తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు
ఇది కూడా చదవండి : Highest Selling Car Brands: ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే
ఇది కూడా చదవండి : Maruti Cars Discount: కొత్తగా కారు కొనేవారికి గుడ్ న్యూస్.. మారుతి కార్లపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్.. ఫుల్ డీటేల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook